ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 25 : యువతీ యువకులు సమాజంలో చెడు అలవాట్లను దూరంగా ఉండి భక్తి భావంతో మెలగాలని సంఘ సేవకుడు పాపిశెట్టి రాము అన్నారు. బుధవారం ఆమనగల్లు పట్టణంలోని శ్రీ భక్త మార్కండేయ దేవాలయ ఆవరణలో వంటగది నిర్మాణానికి భూమి పూజ చేశారు. వంటగది నిర్మాణ దాతలు పాపిశెట్టి కుమార స్వామి కౌసల్య, వారి కుమారులు సాయిరాం మెడికల్ వారి సహకారంతో ఈ కార్యక్రమం దేవాలయ కమిటీ అధ్యక్షులు ఎంగలి బాలకృష్ణయ్య, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ భీమనపల్లి దుర్గయ్య, ఉపాధ్యక్షులు అప్పం శ్రీనివాసులుతో కలిసి పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి శివలింగం, కోశాధికారి గాజుల సత్య రాములు, యువజన సంఘం అధ్యక్షులు మామిడి శెట్టి రవి, కార్యదర్శి పున్న వెంకటేష్, కోశాధికారి చెరుకు రవి, కార్యవర్గ సభ్యులు దోర్నాల ఈశ్వరయ్య, బావుండ్ల నరసింహ, గుర్రం కేశవులు, రమేష్, కోట రాఘవేందర్, అమ్మవారి బిక్షపతి, మస్న మురళి, అవ్వారి పాండు, ఏలే శివకుమార్, శ్రీనివాస్, చెరుకు యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.
యువత భక్తి భావం పెంపొందించుకోవాలి





