శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, అక్టోబర్ 17: తెలంగాణలో యువత బిఆర్ఎస్ వైపే చూస్తుందని ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. ఈ మేరకు మంగళవారం కొండాపూర్ డివిజన్ పరిధిలోని మస్తాన్ నగర్ కాలనీ కి చెందిన కాంగ్రెస్ పార్టీ మరియు బీజేపీ పార్టీల కి చెందిన పలువురు నాయకులు,కార్యకర్తలు, యువకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు సాయి కుమార్ ఆధ్వర్యంలో వివేకానంద నగర్ లోని ఎమ్మెల్యే కార్యాలయంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే గాంధీ వారికి బీఆర్ ఎస్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆరేకపూడి గాంధీ మాట్లాడుతూ యువత అంతా బీఆర్ఎస్ వైపే ఉందని యువతకు అన్ని విధాలుగా అండగా ఉంటామని, కంటికి రెప్పలా చూసుకుంటామని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ప్రతి ఒక్కరు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలోకి చేరడం జరుగుతుందని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఆశీర్వాదిస్తున్నారని ఆయన తెలిపారు. సంక్షేమ పథకాలను చూసి ఇతర పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు సైతం తమ వెంట రావడం పార్టీకి శుభసూచకం అన్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి, బీజేపీ పార్టీ నుండి పెద్ద ఎత్తున యువత,నాయకులు, ,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీలో చేరారని వారిక పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని తెలియజేశారు. ప్రతి ఒక్కరు బీఆర్ ఎస్ పార్టీ పటిష్టతకు సైనికుడిగా పనిచేయాలని, పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. అందరికి మంచి భవిష్యత్తు ఉంటుందని, ప్రతి ఒక్క కార్యకర్తను కంటికి రెప్పలా చూసుకుంటామని, ప్రతి ఒక్కరం కష్టపడి బంగారు తెలంగాణలో భాగస్వాములం అవుదామని గాంధీ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు నాయి నేని చంద్రకాంత్ ,ప్రసాద్ మరియు తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ లో చేరిన వారిలో ముఖ్య నాయకులు రాజు,గురువయ్య, నగేష్, శ్రీనివాస్, వేణు ఆర్. శ్రీనివాస్, గురు, కార్తిక్ తదితరులు ఉన్నారు.
యువత చూపు బీఆర్ఎస్ వైపు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ





