యువత ఉన్నత శిఖరాలను అధిరోహించాలి గ్రామ సర్పంచ్ కృష్ణ

పరిగి, ప్రజాతంత్ర, అక్టోబర్ 21: యువత సన్మార్గాలను ఎంచుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని గ్రామ సర్పంచ్ కృష్ణ అన్నారు.శనివారం దాదాపూర్ గ్రామంలో  శ్రీ చైతన్య యువజన సంఘము, గ్రామ  సర్పంచ్  కృష్ణ అద్వర్యంలో  దాదాపూర్ గ్రామంలో ఆర్మీ ఉద్యోగం సాధించిన తోకని శ్రీనివాస్ ను సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కృష్ణ మాట్లాడుతూ… గ్రామాల్లోని యువకులు ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించి తాము పుట్టిన గ్రామానికి,అలాగే దేశానికి మంచి పేరు ప్రఖ్యాతలు తేవాలని, ఉద్యోగాలు సంపాదించిన ప్రతి ఒక్క ఉద్యోగస్థుడు సొంత ఊరుకు,దేశానికి సేవాలందించి రేపటి తరానికి ఆదర్శనంగా నిలవాలని ,అలాగే యువకులంతా చెడు వ్యసనాలకు దూరంగా ఉండి తమ లక్ష్యం చేరే మార్గం వైపే దృష్టి పెట్టాలని, ఉన్నత చదువులు చదివి జీవితంలో ఉన్నత స్థానాలలో స్థిరపడాలని చెప్పారు . ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ నర్సింలు, కిష్టమోని చందర్, చెన్నయ్య, బాలయ్య,తోకని రాములు,సిద్ది ఈశ్వర్ ,అవుసులోని భాయి వెంకటయ్య,కోస్గి వెంకయ్య, గోపాల్,చెక్క మహేష్, బుగ్గయ్య,తోకని వెంకటయ్య,కిట్టు, దుద్యాల శేఖర్ , శ్రీ చైతన్య యువజన సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *