కందుకూరు,ప్రజాతంత్ర,అక్టోబర్ 31 : యువతను మభ్యపెట్టి యువతకు ఉద్యోగాలు ఇస్తామని బిఆర్ఎస్ కల్లబొల్లి మాటలు చెప్పి యువతను దారుణంగా మోసం చేసిన బిఆర్ఎస్ ప్రభుత్వానికి ఈ ఎన్నికల్లో పరాభావం తప్పదని మహేశ్వరం ఎమ్మెల్యే అభ్యర్థి కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు.మంగళవారం కందుకూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సభకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొందిన సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీని మోసం చేసిందని ఆయన అన్నారు. పార్టీతో పాటు ప్రజలను కూడా మోసం చేసిందని విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు.అలాంటి మోసపూరిత సబితమ్మను నియోజకవర్గంలో ఆమెకు ఓటు వేసి ఎవరు గెలిపిస్తారని,కనీసం ఆమెకు ఓట్లు అడిగే అర్హత కూడా లేదని ఆయన అన్నారు.ఈ ఎన్నికల్లో సబితారెడ్డి ఓటమి ఖాయమని,మహేశ్వరంలో కాంగ్రెస్ జెండా ఎగురవెస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.వృద్ధులకు వికలాంగులకు రెండువేలు,నాలుగు వేలు ఇస్తున్న కేవలం ఇంటిలో ఒకరికి మాత్రమే ఇస్తున్న విషయం ప్రజలు గమనించాలని ఆయన పేర్కొన్నారు. తాము అధికారంలోకి వస్తే తల్లికి పింఛను, కూతురు పెళ్లికి లక్ష రూపాయలు,తులం బంగారం,అత్తకు 4 వేలు,కోడలికి 2500 పెన్షన్లు ఇస్తామని ఆయన తెలిపారు.మోడీ ప్రభుత్వంలో గ్యాస్ ధర విపరీతంగా పెరిగిందని తామ అధికారంలోకి వచ్చిన వెంటనే కేవలం 500లకు మహిళలకు కళ్ళల్లో మంటలు ఏర్పడకుండా ఇచ్చి వారిని ఆదుకుంటామని అన్నారు.200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందజేస్తామన్నారు. మహిళలు ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణించేందుకు వారికి ఉచితంగా ప్రయాణం చేసేందుకు వీలు కల్పిస్తామని అన్నారు.ఇందిరమ్మ ఇల్లు తప్ప డబుల్ బెడ్ రూములు ఎక్కడ అని బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆయన నిరదీశారు. అధికారంలోకి రాకముందు సీఎం కేసీఆర్ తెలంగాణలో మొదటి ముఖ్యమంత్రి దళిత ముఖ్యమంత్రి అని దళితులకు మూడు ఎకరాలు,దళిత బందు,బీసీ బందు,మైనార్టీ బందులు ఏమయ్యాయని హామీలు ఇవ్వడం సాధ్యమే అయినప్పటికీ వాటిని ఆచరణలో అమలు చేయడం బిఆర్ఎస్ కు సాధ్యపడలేదని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ సహాయంతో తొమ్మిది రకాలతో కూడిన సరుకులు రేషన్ బియ్యం అందజేసే వారమని నేడు బిఆర్ఎస్ ప్రభుత్వంలో కేవలం బియ్యం ఇస్తున్నారని బియ్యాన్నే తిందామా అని ప్రజలను కోరారు. రైతుబంధు ఇస్తున్న కేవలం పట్నంలో ఉన్న భూస్వాములకు మాత్రమే డబ్బులు వేస్తున్నారని నిజంగా వ్యవసాయం చేసే పేద రైతులకు కేవలం ఎకరాకు 5000 మాత్రమే అందుతున్నాయని ఆయన తెలిపారు.
ఇలాంటి బి ఆర్ ఎస్ ను వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చల్లా నర్సింహారెడ్డి, దేపా భాస్కర్ రెడ్డి,కందుకూరు మాజీ జెడ్పిటిసి ఏనుగు జంగారెడ్డి,అమరేందర్ రెడ్డి,ఏనుగు శ్రావణి,కందుకూరు మండల పార్టీ అధ్యక్షులు కృష్ణా నాయక్,యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు దంతోజి నరసింహ చారి,బొక్క భూపాల్ రెడ్డి,టి.వినోద్ చారి, సులేమాన్ తదితర నేతలు,నాయకులు, కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
యువతను మభ్యపెట్టి కల్లబొల్లి మాటలు చెప్పిన





