యువజన సంఘాలు వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించడం ఎంతో ఆనందోత్సవం

పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22: యువజన సంఘాలు వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నాయని ఎన్ఎంఆర్ వ్యవస్థాపక అధ్యక్షులు నీలం మధు ముదిరాజ్ తెలిపారు.పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ గ్రామంలో ఆటో యూనియన్, పద్మారావు నాగర్ కాలనీ, తేజ కాలనీ, శ్రీ వివేకానంద గణేష్ కమిటీ  ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మండపాలలో గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఎన్ఎంఆర్ యువసేన లో యువత ఎక్కువగా ఉన్నారని వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఆయన తెలిపారు.ప్రజలకు సేవ చేసేందుకు వారు ఎప్పుడూ ముందుంటారని వారికి ఎటువంటి సహాయ సహకారాలు  కావాలన్నా అందిస్తానని ఆయన చెప్పారు. ప్రజలకు మంచి జరిగే విషయంలో నేనెప్పుడూ ముందుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు, యువజన సంఘాలు, ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *