చిన్నకోడూరు, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 22: యువకులకు డ్రైవింగ్ లైసెన్సు తప్పనిసరని..18 సంవత్సరాలు పై బడిన ప్రతి ఒక్కరు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలనే ఉదేశ్యంతో మంత్రి హరీష్ రావు తన సొంత ఖర్చులతో డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పిస్తున్నారు.ఇందులో భాగంగా శుక్రవారం మండల పరిధిలోని మెట్టుపల్లి గ్రామానికి చెందిన 30 మంది యువకులకు రూపాయి ఖర్చు లేకుండా సర్పంచ్ విజయ వినయ్ రెడ్డి ఉచిత లెర్నింగ్ లైసెన్సులు ఇచ్చారు.యువకులను గుర్తించి పైసా ఖర్చు లేకుండా ప్రతి ఒక్క యువకులకు తన సొంత డబ్బులు పెట్టి డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పిస్తున్న ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుకు యువకులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో నాయకులు శంకర్, వేణు తదితరులు పాల్గొన్నారు.


