యాదవుల సంప్రదాయాలను గౌరవిస్తాషాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

షాద్ నగర్ ప్రజా తంత్ర డిసెంబర్ 19: షాద్ నగర్  మున్సిపాలిటీ పరిధిలోని 3, 4వ వార్డు మరియు చటాన్ పల్లి యాదవులంతా కలిసి షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు యాదవుల సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా రుమాలు, గొంగడి, గొర్రె పిల్లతో ఘనంగా సత్కరించడం జరిగింది.
షాద్ నగర్ లోని కేకేఆర్ కన్వెన్షన్ లో జరిగిన ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. నేటి సమాజంలో కనుమరుగవుతున్న కుల సాంప్రదాయాలను వెలుగులోకి తీసుకొచ్చే విధంగా ఇప్పటికీ కృషి చేస్తున్నటువంటి యాదవ కులస్తులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో గొల్ల కురుమలకు ప్రత్యేకంగా వారి యొక్క అవసరాలకు అనుగుణంగా ఉండే విధంగా నా వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో నందారం లక్ష్మీనారాయణ యాదవ్, అఖిల భారత యాదవ మహాసభ మున్సిపాలిటీ టౌన్ అధ్యక్షుడు నక్క బాల్ రాజ్ యాదవ్, నందారం కుమార్ యాదవ్, నందారం శ్రీశైలం యాదవ్,నందారం శ్రీనివాస్ యాదవ్, విటమొని సత్యనారయణ యాదవ్ తదితరులు పాల్గొని నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు శుభాకాంక్షలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *