మోదీ తెలంగాణ శని…

  • కాంగ్రెస్‌ ‌పాలనలో అభివృద్ధ్ది శూన్యం…
  • తెలంగాణ ఏర్పడ్డాకే అభివృద్ధ్ది…
  • ప్రశ్నిస్తే ఐటీ,ఈడీ దాడులతో కేంద్రం దాడులు
  • బరాబర్‌ ‌కేసీఆర్‌ ‌కుటుంబ పాలన : ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌

జనగామటౌన్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 27: మోదీ దేవుడు కాదని తెలంగాణకు పట్టిన శని అని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ఐటీ ,పురపాలికశాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. జిల్లాలోని స్టేషన్‌ఘన్‌పూర్‌ ‌నియోజకవర్గంలో వేలేరు మండలంలోని సోడాపల్లిలో మూడు లిఫ్ట్ ఇరిగేషన్‌ ‌ప్రాజెక్టులను రూ.150 కోట్లతో మంత్రి కేటీఆర్‌ ‌చేతుల మీదుగా శంకుస్దాపన చేసారు.అనంతరం మంత్రి కేటీఆర్‌ ‌మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తుండడంతో ప్రతిపక్ష నాయకులకు ఏది మాట్లాడాలో తెలియక కుటుంబ పాలన అంటున్నారని,బరాబర్‌ ‌మాది కుటుంబ పాలననేన్నారు.

రాష్ట్రంలోని నాలుగు కోట్ల మంది ప్రజలకు  కేసీఆర్‌ ‌పెద్దద్కిని వారే మా కుటుంబ సభ్యులన్నారు.దేశంలోని నల్లదనాన్ని వెలక్కితీసి పేద ప్రజల అకౌంట్లలో రూ.15లక్షలు వేస్తామని ఇంత వరకు వేయలేదన్నారు.మోదీ బుల్లెట్‌ ‌రైలు తీసుకొస్తామని ఇంత వరకు ప్యాసింజర్‌ ‌రైలును కూడా తీసుకురాలేదని ఎద్దేవా చేసారు.కొందరు పనికిమాలిన పాదయాత్రలు చేసి ప్రజలను రెచ్చగొడుతున్నారని రేవంత్‌రెడ్డి పిచ్చి కూతలు కూస్తున్నారన్నారు.ఒక్క అవకాశమివ్వాలని అడుక్కుంటున్న కాంగ్రెస్‌ ‌పార్టీ ఒక దిక్కుమాలిన పార్టీ అన్నారు.స్టేషణ్‌ఘన్‌పూర్‌ను మున్సిపాలీటీ తప్పకుండా చేస్తామని,డిగ్రీ కాలేజీని మంజూరు చేస్తామని హామిచ్చారు.డాక్టర్‌ ‌ప్రీతి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటూ ఆమె ఆత్మహత్యకు కారకుడు ఎంతటి వాడైనా కానీ వదిలిపెట్టే ప్రసక్తేలేదన్నారు.

కాబోయే సీఎం కేటీఆర్‌..‌కడియం
కాబోయే సీఎం కేటీఆర్‌ అని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి  అన్నారు.స్టేషణ్‌ఘన్‌పూర్‌ను మున్సిపల్‌ ‌చేయాలని, డిగ్రీ కాలేజీని,100 పడకల ఆసుపత్రి, రఘునాధపల్లిలో ఇంటర్‌ ‌కాలేజీని ఏర్పాటు చేయాలని  కోరడంతో తప్పకుండా నెరవేర్చుతామని మంత్రి హామిచ్చారన్నారు.

నియోజకవర్గ ప్రజలే నాకు దేవుళ్లు..ఎమ్మెల్యే రాజయ్య
తెలంగాణ కోసం ఎమ్మెల్యే పదవిని లెక్కచేయకుండా తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసానన్నారు.సీఎం కేసీఆర్‌ ‌తనను కడుపులో కాపాడుకుని 2014, 2018లో ఘన్‌పూర్‌ ‌లో కేటీఆర్‌ ‌నన్ను చేతపట్టుకుని గెలపించారన్నారు.సీఎం కేసీఆర్‌ ఆశీర్వాదంతో ఘన్‌పూర్‌కు ప్రత్యేక నిధులు తీసుకొచ్చి పంట పొలాలకు నీళ్లు అందించడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాధోడ్‌, ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రెడ్డి, బండ ప్రకాష్‌, ఎం‌పీలు పసునూరి దయాకర్‌, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, శంకర్‌ ‌నాయక్‌, ఆరూరి రమేష్‌, ‌దాస్యం వినయ్‌ ‌భాస్కర్‌, ‌చల్లా ధర్మారెడ్డి, నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.

ప్రీతికి అన్యాయం చేసిన వాడిని శిక్షిస్తాం
సైఫ్‌ అయినా, సంజయ్‌ అయినా.. వదలం  స్టేషన్‌ ‌ఘనాపూర్‌ ‌సభలో మంత్రి కెటిఆర్‌ ‌హెచ్చరిక
జనగామ,ప్రజాతంత్ర,ఫిబ్రవరి27:పీజీ వైద్య విద్యార్థిని ప్రీతికి అన్యాయం చేసిన వాడు సైఫ్‌ అయినా, సంజయ్‌ అయినా.. ఎవడైనా సరే వదిలిపెట్టం.. చట్టపరంగా శిక్షిస్తామని మంత్రి కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు. ఈ విషయంపై జిల్లా పర్యటనలో ఆయన ఘాటుగగా స్పందించారు.  స్టేషన్‌ ‌ఘన్‌పూర్‌ ‌నియోజకవర్గంలో రూ. 125 కోట్లతో పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలకు శంకుస్థాపనలు చేసిన సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్‌ ‌ప్రసంగించారు. ప్రీతి ఆత్మహత్య విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న రాజకీయాలపై కేటీఆర్‌ ‌తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇవాళ ప్రతి చిన్న అంశాన్ని రాజకీయం చేస్తున్నారు అని కేటీఆర్‌ ‌మండిపడ్డారు.

వరంగల్‌ ఎం‌జీఎంలో పీజీ చదువుతున్న డాక్టర్‌ ‌ప్రీతి దురదృష్టావశాత్తూ కాలేజీలో జరిగిన గొడవల్లో మనస్తాపానికి గురై ఆ అమ్మాయి చనిపోయింది. ఆ అంశాన్ని కూడా రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ అమ్మాయి చనిపోతే అందరం బాధపడ్డాం. మంత్రులు సత్యవతి రాథోడ్‌, ‌దయాకర్‌ ‌రావు, ఎమ్మెల్యే శంకర్‌ ‌నాయక్‌, ఎం‌పీ కవిత వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ వేదిక నుంచి ప్రీతి కుటుంబానికి తమ పార్టీ, ప్రభుత్వం తరఫున మనస్ఫూర్తిగా సంతాపం ప్రకటిస్తున్నాం. కొంత మంది రాజకీయంగా చిల్లరమల్లర మాటలు మాట్లాడొచ్చు కానీ తాము ప్రభుత్వం, పార్టీ పరంగా ఆ కుటుంబానికి అండగా ఉంటాం. ఆ అమ్మాయికి అన్యాయం చేసిన వాడు ఎవడైనా సరే.. వాడు సైఫ్‌ ‌కావొచ్చు.. సంజయ్‌ ‌కావొచ్చు.. ఇంకెవడైనా సరే.. వదిలిపెట్టం అని ఘాటుగా హెచ్చరించారు. తప్పకుండా చట్టపరంగా, న్యాయపరంగా శిక్ష వేస్తాం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అన్నారు.  ప్రతి చిన్న అంశాన్ని రాజకీయం చేయడం, చిల్లరమల్లర మాటలు మాట్లాడటం సరికాదని కేటీఆర్‌ ‌హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కడియం శ్రీహరి, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *