మోదీ చిత్రపటానికి బిజెపి నాయకుల పాలాభిషేకం

 ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 30 : పేద, మధ్య తరగతి కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.200 తగ్గించాలని గొప్ప నిర్ణయం తీసుకున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ కి  హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ బుధవారం ఆమనగల్ పట్టణంలోని రాజీవ్ గాంధీ చౌరస్తా వద్ద బిజెపి పట్టణ అధ్యక్షుడు శ్రీకాంత్ సింగ్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న అక్కచెల్లెలందరికీ మోదీరక్షా బంధన్ కానుకగా ప్రధానమంత్రి ఉజ్జ్వల యోజన లబ్ధిదారులకు రూ. 400 సబ్సిడీ అందించడం పేదల పట్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం అని అన్నారు.ఈ తగ్గింపు వల్ల ప్రయోజనం పొందనున్న దేశంలో 33 కోట్ల మంది వంట గ్యాస్ వినియోగదారుల తరఫున నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వానికి మరొక్కసారి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆమనగల్లు మున్సిపాలిటీ చైర్మన్ రాంపాల్ నాయక్, వైస్ చైర్మన్ దుర్గయ్య, మున్సిపాలిటీ బిజెపి అధ్యక్షుడు శ్రీకాంత్ సింగ్, నియోజకవర్గం కో కన్వీనర్ గోరంటి నర్సింహ, మున్సిపాలిటీ కౌన్సిలర్స్ చెక్కల లక్ష్మణ్, చెన్నకేశవులు, దుడ్డు కృష్ణ యాదవ్, రంగారెడ్డి జిల్లా బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు కండే సాయి కుమార్, ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి విష్ణుచారి, కల్వకుర్తి నియోజకవర్గం మీడియా ఇంచార్జ్ రవి రాథోడ్, బీజేవైఎం బిజెపి సీనియర్ నాయకులు బుచ్చయ్య, పద్మ ప్రశాంత్, హనుమంతు సీతారాం, జితేందర్, శేఖర్, రవి, పత్య నాయక్, రాంపాల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *