మోదీకి శృంగభంగం… రాహుల్‌ విజయదరహాసం..!

కమలం దూకుడుకు చెయ్యి అడ్డుకట్ట
అనూహ్యంగా ఎన్‌డిఏకు ఇండియా కూటమి గట్టి పోటీ
400 పార్‌ కాదు…300 కూడా పార్‌ కాని బిజెపి కూటమి
సొంతగా మెజారిటీ సాధించలేని బీజేపీ..239 స్థానాలతో సరి
దాదాపుగా 291 స్థానాలతో ఎన్‌డిఏకు సాధారణ మెజారిటీ
యూపీలో పనిచేయని ‘రామ మందిరం’
హిందీ బెల్ట్‌లో బిజెపికి ఎదురు దెబ్బ…కలిసొచ్చిన దక్షిణాది, ఒడిషా
పనిచేయని మోదీ ఛరిష్మా…హిందూత్వ మంత్రం
100 సీట్లకు చేరువలో కాంగ్రెస్‌..ఇండియా కూటమికి దాదాపుగా 235 సీట్లు
భారత ప్రజాస్వామ్య శక్తిని చాటిన వోటర్లు

ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌, జూన్‌ 4 : భారత ప్రజాస్వామ్యానికి ఉన్న శక్తి మరోసారి నిరూపితమయింది. లోక్‌ సభ ఎన్నికల ఫలితాలు పరిశీలిస్తే దేశానికి సంబంధించి మనం తరచూ ప్రస్తావించే ‘బ్యూటీ ఆఫ్‌ డెమొక్రసీ’ని చవి చూపించాయి. ‘ఔర్‌ ఏక్‌ బార్‌ 400 పార్‌’ నినాదంతో తమకేవరూ ఎదురు లేరని విర్రవీగుతున్న బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డిఏ కూటమికి దేశ ప్రజలు గట్టి రaలక్‌ ఇచ్చారు. 2019లో మాదిరిగా బీజేపీ సొంతగా మెజారిటీ సాధించలేక 235 సీట్లతో సరిపెట్టుకుంది. అయితే దాదాపుగా 290 స్థానాలతో   ఎన్‌డిఏ కూటమి సాధారణ మెజారిటీని సాధించి పరువు నిలుపుకుంది. ఇక కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఇండియా కూటమి దాదాపుగా 235 స్థానాలకు అటుఇటుగా సాధించగా..కాంగ్రెస్‌ సొంతగా చెప్పుకోదగ్గ స్థాయిలో 100 స్థానాలను గెలుచుకుంది. రాజకీయ లబ్ది కోసం మతాలను, విశ్వాసాలను, మందిరాలను వాడుకోవడాన్ని దేశ ప్రజలు దాదాపుగా తిరస్కరించారు. ప్రచారాలతో మభ్యపెట్టడానికి తామేమీ అమాయకులం కాదని తమ వోటు అనే వజ్రాయుధంతో జవాబు చెప్పారు.

ఈ ఎన్నికలలో మోదీ ఛరిష్మా అంతగా పని చేయలేదు. దేశంలో ప్రధాన సమస్యలయిన నిరుద్యోగం, ధరల పెరుగుదల, సామాజిక ఆర్థిక అంతరాల పరిష్కారం చేసే దిశగా కాకుండా మతాలను విభజిస్తూ, దేవుళ్ల పట్ల ప్రజల విశ్వాసాలను వోట్ల కోసం వాడుకుంటూ ప్రజల మధ్య విద్వేషాలను ప్రేరేపించే ప్రధాని మోదీ ప్రసంగాల పట్ల ప్రజలు తమ అసమ్మతిని తెలిపారు. మరోవైపు రాజ్యాంగ, ప్రజాస్వామ్య పరిరక్షణ, ప్రజల మధ్య ప్రేమ, సౌభ్రాతృత్వాలు పెంపొందించడం, ప్రజల మధ్య సామాజిక, ఆర్థిక అంతరాలు తగ్గించడం తమ లక్ష్యమన్న కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ ఆశ్వాసాల పట్ల ప్రజలు చాలా వరకు విశ్వసించారు. బీజేపీ ఎన్నికల ప్రధానంశంగా ఎన్నుకున్న రామమందిరం నిర్మించిన రాష్ట్రంలోనే బీజేపీకి చేదు అనుభవం ఎదురైంది. సార్వత్రిక ఎన్నికలలో గెలుపును నిర్దేశించే సంఖ్యలో 85 స్థానాలున్న, బీజేపీ ఎక్కువగా ఆశలు పెట్టుకున్న యూపీలో కనీసం 50 శాతం సీట్లు కూడా సాధించలేక చతికిలబడిరది. అక్కడ ఇండియా కూటమి పెద్ద ఎత్తున విజయాన్ని సాధించింది. అక్కడ ఇండియా కూటమి భాగస్వామి అఖిలేష్‌ యాదవ్‌ నేతృత్వం వహిస్తున్న సమాజ్‌ వాది పార్టీ 35 సీట్లకు పైగా సాధించి తమ సత్తా చాటింది.

కాంగ్రస్‌ కూడా చెప్పుకోదగ్గ సీట్లను సాధించి పోయిన తమ పట్టును కొంత మేరకు నిలుపుకోగలిగింది. గమనించదగ్గ విషయమేమంటే గత 2019 లోక్‌ సభ ఎన్నికలలో యూపీలోని రాయ్‌బరేలీ నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో పరాజయం పాలయిన రాహుల్‌ గాంధీ ఈ సారి అదే రాయ్‌బరేలీ నుంచి పోటీ చేసి అదే బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీపై విజయం సాధించారు. ఇక ఇదే రాష్ట్రంలో వారణాసి నుంచి పోటీ చేసిన ప్రధాని మోదీ కూడా ఊహించినట్లుగానే మరోసారి విజయం సాధించారు. కాగా నిరుద్యోగం, పేదరికం తదితర తీవ్ర సమస్యలతో సతమతమవుతున్న యూపీ ప్రజలు ఎంత సేపూ రామమందిరం ప్రస్తావనతో కాలం గడుపుతున్న మోదీ పాలనతో విసిగి పోయారని అనుకోవచ్చు. రాష్ట్రంలోని కొన్ని వర్గాల ప్రజలు నిర్ద్వంద్వంగా బీజేపీకి దూరమయ్యారని చెప్పవొచ్చు. ఇక మరో పెద్ద రాష్ట్రం బీహార్‌లో ఎన్‌డిఏ భాగస్వామి నితీష్‌ కుమార్‌ నేతృత్వంలోని జెడి(యు) చెప్పుకోదగ్గ సంఖ్యలో 13 స్థానాలలో, బీజేపీ 12 స్థానాలలో విజయం సాధించడం కొంత మేర ఎన్‌డిఏకు కలిసి వొచ్చిన అంశం. ఇక్కడ ఇండియా కూటమి 7 స్థానాలతో సరిపెట్టుకుంది. అయితే బీహార్‌లో కూడా ప్రజలు పేదరికం, నిరుద్యోగం వంటి తీవ్ర సమస్యలతో సతమతమవుతున్నప్పటికీ నితీష్‌ కుమార్‌ ఛరిష్మాతో ఇక్కడ బీజేపీకి కొంతవరకు ఉపశమనం లభించింది. ఇక దిల్లీ, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలలో ఎన్‌డిఏ కూటమి క్లీన్‌ స్వీప్‌ చేసింది. దిల్లీలో 7 లో 7కు ఏడు సీట్లను బీజేపీ గెలుచుకోగలిగింది. దానికి దిల్లీ లిక్కర్‌ స్కామ్‌ సహా సిఎం కేజ్రీవాల్‌ జైలు పాలవడం వంటి అంశాలు ఇక్కడ బీజేపీకి లాభించాయి. దీనికి బీజేపీ వేసిన స్కెచ్‌ వందకు వంద శాతం ఫలితాలనిచ్చింది. ఇక మోదీ స్వరాష్ట్రం గుజరాత్‌లో సహజంగానే బీజేపీ 25 సీట్లను గెలుచుకోగా కాంగ్రెస్‌ ఒక సీటులో విజయం సాధించింది. ఇక్కడి గాంధీనగర్‌ స్థానం నుంచి పోటీ చేసిన కేంద్ర హోమ్‌ మంత్రి అమిత్‌ షా రెండవ సారి గెలుపొందారు. ఇక మధ్యద్రేశలో మొత్తం 29 స్థానాలనూ బీజేపీ కైవసం చేసుకుంది.

ఇక రాజస్థాన్‌లోని 25 స్థానాలలో బీజేపీ 14 స్థానాలలో గెలుపొందగా, కాంగ్రెస్‌ 8 స్థానాలలో, ఇతరులు 3 స్థానాలలో గెలుపొందారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో రాజస్థాన్‌లో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం విధితమే. ఇక జార?ండ్‌లోని 14 సీట్లలో 8 బీజేపీ గెలుచుకోగా. కాంగ్రెస్‌ 2, జెఎంఎం 3 స్థానాలను గెలుచుకుంది. ఇక చత్తీస్‌ ఘడ్‌లోని 11 స్థానాలలో 10 స్థానాలతో బీజేపీ ఘన విజయం సాధించగా కాంగ్రెస్‌ ఒక స్థానం గెలుచుకుంది. ఇక రైతులు బీజేపీ పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్న పంజాబ్‌ రాష్ట్రంలోని 13 స్థానాలలో కాంగ్రెస్‌ 7 సీట్లలో గెలుపొందగా. ఆప్‌ 3 స్థానాలలో, శిరోమని అకాలీదళ్‌  ఒక స్థానంలో గెలుపొందారు. ఇక రైతులు బీజేపీ పట్ల విముఖతతో ఉన్న హర్యానాలో 10 సీట్లకు గాను 5 ఇంటిని బీజేపీ గెలుచుకోగా, కాంగ్రెస్‌ 5 సీట్లను గెలుచుకుంది. ఇక ఈశాన్య రాష్ట్రం అరుణాచల్‌ ప్రదేశ్‌లో 2 సీట్లకు 2 సీట్లు బీజేపీ గెలుచుకుంది. అస్సాంలో 14 స్థానాలకు గాను 9 స్థానాలలో బీజేపీ, 3 స్థానాలలో కాంగ్రెస్‌ ఒక స్థానంలో అసాం గణ పరిషత్‌ విజయం సాధించింది. గోవాలోని 2 స్థానాలలో ఒకటి బీజేపీ, ఒకటి కాంగ్రెస్‌ గెలుచుకున్నాయి. ఇక హిమాచల్‌ ప్రదేశలోని 4 స్థానాలనూ బీజేపీ గెలుచుకుంది. ఇక మరో ముఖ్యమైన రాష్ట్రం మహారాష్ట్రలో ఇండియా కూటమి అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. మహారాష్ట్రలోని 45 స్థానాలలో కాంగ్రెస్‌ 12, శివ సేన(ఉద్ధవ్‌)  10 సీట్లు, బీజేపీ 11, ఎన్‌సీపీ(శరద్‌) 7, శివ సేన 6, ఇతరులు 2 సీట్లను గెలుచుకున్నారు. ఇక మణిపూర్‌లోని 2 సీట్లనూ కాంగ్రెస్‌ గెలుచుకుంది. ఇక మేఘాలయాలోని 2 సీట్లలో ఒకటి కాంగ్రెస్‌, ఇతరులు ఒకటి గెలుచుకున్నాయి. నాగాలాండ్‌లోని ఒక స్థానంలో కాంగ్రెస్‌ విజయం సాధించింది. ఇక ఒడిషాలో బీజేపీ అద్భుత విజయం సాధించింది. ఒక్కడ మొదటి సారిగా ఇంత కాలం అప్రతిహత విజయాలతో కొనసాగుతున్న నవీన్‌ పట్నాయక్‌ నేతృత్వంలోని బిజు జనతాదళ్‌కు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇక్కడి 21 స్థానాలలో ఊహించని విధంగా 19 స్థానాలతో బీజేపీ విజయం సాధించగా, ఒక స్థానంలో కాంగ్రెస్‌, ఒక స్థానంలో బిజు జనతాతళ్‌ గెలుచుకున్నాయి.

ఇక్కడ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలలోనూ బీజేపీ అద్భుత విజయం సాధించి మరో రాష్ట్రాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇక మరో ఆసక్తికర రాష్ట్రం కేరళలోని 20 స్థానాలలో 14 సీట్లను గెలుచుకుని కాంగ్రెస్‌ అద్భుత విజయం సాధించింది.  ఇక్కడ ఇండియన్‌ ముస్లిం లీగ్‌ 2 స్థానాలలో, బీజేపీ ఒక స్థానంలో, కమ్యూనిస్‌ పార్టీ(మార్క్సిస్ట్‌) ఒక స్థానంలో, ఇతరులు 2 స్థానాలలో గెలుపొందారు. ఇక  దక్షిణాది రాష్ట్రం తమిళనాడులోని 29 స్థానాలలో ఇండియా కూటమి భాగస్వామి డిఎంకె 22 స్థానాలను గెలుచుకోగా, కాంగ్రెస్‌ స్థానాలను, ఇతరులు 8 స్థానాలను గెలచుకున్నారు. ఇక అధికారంలో ఉన్న కర్నాటకలో కాంగ్రెస్‌ పార్టీకి దెబ్బ తగిలింది. ఇక ్కడ 28 స్థానాలకు గాను బీజేపీ 17 స్థానాలలో గెలచెకుని ముందంజలో ఉండగా, కాంగ్రెస్‌ 9 సీట్లతో సరిపెట్టుకోగా, జెడి(యు) 2 సీట్లలో గెలుపొందింది.

ఇక మరో పెద్ద రాష్ట్రం, ఉద్రక్తతల నడుమ ఎన్నికలు కొనసాగిన పశ్చిమ బెంగాల్‌ లోని 42 స్థానాలలో ఇండియా కూటమి భాగస్వామి మమతా బెనర్జీ నేతృత్వంలోని టిఎంసి 29 స్థానాలలో గెలుపొందగా, కాంగ్రెస్‌ ఒక స్థానంలో, బీజేపీ 12 సీట్లలో గెలుపొందింది. ఇక ఉత్తరాఖండ్‌లోని 5కు 5 సీట్లు బీజేపీ గెలుచుకుంది. ఇక మరో తెలుగు రాష్ట్రం ఏపీలో చివరి నిమిషంలో జన సేనతో కలిసి ఎన్‌డిఏ కూటమిలో చేరిన టీడీపీ లోక్‌ సభ ఎన్నికలతో సహా అసెంబ్లీ ఎన్నికలలోనూ వైఎస్‌ఆర్‌సిపిని మట్టి కరిపించి చారిత్రాత్మక విజయం సాధించింది. ఇక్కడి 25 సీట్లలో టిడిపి 16 స్థానాలలో, జన సేన 2 సీట్లలో, బీజేపీ 3 సీట్లలో విజయం సాధించగా, వైఎస్‌ఆర్‌సిపి 4 స్థానాలతో సరిపెట్టుకుంది. ఇక తెలంగాణలోని 17 సీట్లలో కాంగ్రెస్‌, బీజేపీ చెరి 8 సీట్లు గెలుచుకోగా ఏఐఎంఐఎం తన స్థానాన్ని నిలబెట్టుకుంది.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *