హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబరు 17 : ప్రధాని నరేంద్ర మోడీపై మంత్రి కేటీఆర్ విమర్శల దాడి కొనసాగిస్తున్నారు. తాజాగా మోడీకి ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి ఇవ్వాలంటూ విమర్శలు గుప్పించారు. కొరోనా టీకా కనిపెట్టినందుకు మోడీకి నోబెల్ బహుమతికి అర్హులంటూ ఎద్దేవా చేశారు. టీకా ఒక్కటే కాదు డీమానిటైజేషన్, స్విస్ బ్లాక్ మనీ రిటర్న్ చేసినందుకు ఆర్థికశాస్త్రంలో నోబెల్ ఇవ్వాలంటూ ట్వీట్ చేశారు. ‘ప్రధాని మోడీ నోబెల్ బహుమతికి అర్హులు..కానీ ఏ కేటగిరీలో ఉన్నారు.
కోవిడ్ టీకాను కనిపెట్టినందుకు వైద్యంలో నోబెల్ ఇవ్వాలి. డీమానిటైజేషన్, స్విస్ బ్లాక్ మనీ రిటర్న్ చేసినందుకు ఆర్థిక శాస్త్రంలో నోబెల్ ఇవ్వాలి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని 6 గంటల పాటు ఆపినందుకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలి. రాడార్ సిద్దాంతానికి భౌతిక శాస్త్రంలో నోబెల్ ఇవ్వాలి’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.




