మొదటి రోజే యూనిఫామ్‌

  • నేడు రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల పున:ప్రారంభం
  •  సర్కార్‌ బడులలో విద్యార్థులకు యూనిఫామ్‌ అందజేయనున్న ప్రభుత్వం
  •  దేశంలోనే తొలిసారిగా మహిళా సంఘాలకు స్టిచింగ్‌ బాధ్యతలు  
  •  కుట్టుకూలీ జతకు 50 నుండి 75 రూపాయలకు పెంపు
  •  మంత్రి సీతక్క చొరవతో గడువులోపు పనులు పూర్తి
  •  మహిళా సంఘాలకు, అధికారుల కృషికి మంత్రి అభినందనలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 11 : ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫాం లు సిద్ధమయ్యాయి. నేడు రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు తెరుచుకోనున్న నేపథ్యంలో సర్కార్‌ బడులలో విద్యార్థులకు యూనీఫామ్‌ అందజేయనున్నారు. కాగా యూనిఫామ్‌ స్టిచింగ్‌కు సంబంధించిన పనులను దేశంలోనే తొలిసారిగా మహిళా సంఘాలకు తెలాంగాణ ప్రభుత్వం అప్పగించగా స్టిచింగ్‌ పనులు తుది దశకు చేరుకున్నాయి. దాంతో నేడు పాఠశాలల ప్రారంభం రోజునే విద్యార్థులకు యూనిఫామ్‌లు అందనున్నాయి. ఎమ్మెల్యే లు, ప్రజాప్రనిధులు ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు యూనిఫామ్‌లు అందజేయ నున్నారు. గతంలో స్టిచింగ్‌ పనులను పరిమిత సంఖ్యలో టెయిలర్లకు అందజ ేయడం వల్ల పంపిణీ చేసేందుకు ఆలస్యమయ్యేది.

పాఠశాలలు ప్రారంభమైన మూడు నాలుగు నెలల వరకు విద్యార్థులకు యూనిఫామ్‌లు అందని పరిస్థితి ఉండేది. సమస్యను గుర్తించిన రేవంత్‌ సర్కార్‌ సమస్యను పరిష్కరించే దిశగా చర్యల్లో భాగంగా కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టి దేశంలోనే తొలిసారిగా మహిళా సంఘాలకు స్టిచింగ్‌ పనులను అప్పగించి గడువు లోపల విద్యార్థులకు యూనిఫామ్‌లు అందే విధంగా ఏర్పాట్లు చేసింది. అదే విధంగా ఇంత కాలం 50 రూపాయలున్న కుట్టు కూలీని 75కు పెంచింది. దాంతో మహిళా సాంఘాలు యూనిఫామ్‌ స్టిచంగ్‌ పనులను సవాల్‌గా స్వీకరించి యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయగలిగారు. రాష్ట్రంలో 64 లక్షల మాంది మహిళా సంఘాల సభ్యులు ఉండగా 18000    (ఖీ2వ పేజీలో…)

విలేజ్‌ ఆర్గనేజేషన్‌లు ఉన్నాయి. వారికి 15,30,603 (జతల) యూనిఫమ్‌లు కుట్టాలని ప్రభుత్వం ఆదేశించగా, ఇప్పటి వరకు 90 శాతం యూనిఫాంలు పూర్తయ్యాయి. మహిళా సంఘాలు ప్రభుత్వానికి సహాయకులుగా ఈ పనిని నిర్వహించినందుకు మంత్రి సీతక్క ప్రభుత్వం తరఫున వారికి అభినందనలు తెలిపారు. మహిళా సంఘాలకు యూనీఫామ్‌ల స్టిచింగ్‌ పని కేటాయించినందు వల్ల వారికి ఆర్థికంగా సంవత్సరానికి రూ.50 కోట్ల ఆదాయం సమకూరుతుంది. మంత్రి సీతక్క ప్రత్యేకంగా చొరవ తీసుకుని ప్రణాళికా బద్ధంగా ,ర్యలు చేపట్టడం వల్లనే మొదటి రోజే యూనీపామ్‌ అందజేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం నెరవేరినట్లు పబ్లిసిటీ సెల్‌ ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రకటన ద్వారా తెలిపింది. కాగా మహిళా సాంఘాలకు స్టిచింగ్‌ పనులను అప్పగించిన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి, సకాలంలో పనులు పూర్తి చేసేందుకు కృషి చేసిన మహిళా సంఘాలను, అధికారులను మంత్రి సీతక్క ఈ సందర్భంగా అభినందించారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *