పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 7: 9వ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని మున్సిపల్ కార్యాలయం, నరేంద్ర కాలనీ సీత లేఔట్, బీరంగూడలో సోమవారం అమీన్ పూర్ మునిసిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి,మున్సిపల్ కమిషనర్ జ్యోతిరెడ్డిలు మొక్కలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కృష్ణ, పట్లోళ్ల కల్పన ఉపేందర్ రెడ్డి, చంద్రకళ గోపాల్, ఎడ్ల రమేష్, సీనియర్ నాయకులు చంద్రశేఖర్, ప్రజా ప్రతినిదులు పాల్గొన్నారు.


