ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 30 : కడ్తాల మండలంలోని మైసిగండి గ్రామంలో బంజారా లు జరుపుకునే తీజ్ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. పలువురు ప్రముఖులు హాజరై గిరిజనులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతిని ప్రేమించే బంజారాలది విభిన్న సాంస్కృతి సంప్రదాయాలతో కూడిన ఆచార వ్యవహారాలు కట్టుబొట్లు భాష ప్రేమతో కూడిన సంస్కారం భిన్నంగా ఉంటాయి. తొమ్మిది రోజులపాటు జరిగే వేడుక ఇది. వర్షాలు సమృద్ధిగా కురవాలని పాడిపంటలు సస్యశ్యామలంగా ఉండాలని చేసుకునే పండుగ తీజ్.. తాండ పెద్దల ఆదేశాల మేరకు వారి వారి ఆర్థిక పరిస్థితుల కనుగుణంగా గోధుమలు వరీనీ తెచ్చి నీటిలో నానబెడతారు. బుట్టలో ఎరుపు ఇసుకను సేకరించి పెద్దల సమక్షంలో నింపి ప్రతిరోజు ఉదయం సాయంత్రం పెళ్ళికాని కన్యలు బావి, బోర్ల నుంచి తెచ్చిన నీరు పోస్తారు. బుట్టలో పెరిగిన తీజ్ గ్రామ పెద్దలు తల పాగాలో గుచ్చుతారు. ఎవరి జీవితం శాశ్వతం కాదు అనే నమ్మకంతో ఈ వేడుక జరుగుతుంది. బుధవారం నిర్వహించిన వేడుకల్లో మొలచిన మొలకలను గిరిజన యువతులు నెత్తి పైన పెట్టుకొని డీజే లంబాడి ముత్యాలతో ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి పాల్గొని గిరిజనులకు తీజ్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తుల్జా భవాని ఆలయాన్ని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా మైసిగండి సర్పంచ్ తులసి రామ్ నాయక్ గోలి శ్రీనివాస్ రెడ్డికి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అమనగల్లు మార్కెట్ కమిటీ డైరెక్టర్ సురమల్ల సుభాష్, బి ఆర్ ఎస్ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, సతీష్, సుమన్, శ్రీకాంత్, శ్రీరామ్, నాగిళ్ల తిరుపతయ్య, శేఖర్, కిరణ్, మణికంఠ, మాదారం మహేష్, సుమన్ నాయక్, రాజు, అశోక్, పాల్గొన్నారు.




