మైనార్టీల అభివృద్ధి, సంక్షేమం కోసం కృషి చేసిన ఏకైక పార్టీ బి ఆర్ ఎస్. హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నే శ్రీనివాసరావు

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, నవంబర్ 17: మైనారిటీల అభివృద్ధి, సంక్షేమం కోసం కృషిచేసిన ఏకైక పార్టీ భారత రాష్ట్ర సమితి అని హైదర్ నగర్ కార్పొరేటర్ నార్నే శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం శేర్లింగంపల్లి నియోజకవర్గం పరిధి హైదర్ నగర్ డివిజన్ లోనీ హైదర్ నగర్ గ్రామంలోని  మసీద్ ముందు ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా నార్నే శ్రీనివాసరావు మాట్లాడుతూ ముస్లిం మైనారిటీలకు షాదీ ముబారక్ ముస్లింల కోసం హైదర్ నగర్ లో స్మశాన వాటిక అభివృద్ధి మైనారిటీ పాఠశాలలు మైనార్టీల కోసం కళ్యాణ మండపాలను కూడా త్వరలో నిర్మిస్తున్నట్లు కార్పొరేటర్ తెలిపారు. ఈనెల 30న జరగబోయే ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై ఓటు వేసి అభ్యర్థి ఆరెకపూడి గాంధీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.  ఈ కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి పార్టీ సీనియర్ నాయకులు నక్క శ్రీనివాస్,షరీఫ్, ఖదీర్,అష్రాఫ్,మురుగన్,తదితరు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *