మైనార్టీల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, నవంబర్ 8: మైనార్టీల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని గత దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న కాలంలో మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించి వారి అభివృద్ధికి బాటలు వేయడం జరిగిందని వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం వికారాబాద్ మైనారిటీ టౌన్ వైస్ ప్రెసిడెంట్ గా నియమితుడైన గంగారంకు చెందిన మహమ్మద్ ఫరూక్ ఖురేషికి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి మైనార్టీ సెల్ నియోజకవర్గం అధ్యక్షులు సర్పరాజ్ మైనార్టీ సెల్ పట్టణ అధ్యక్షుడు హాజీ భాషల ఆధ్వర్యంలో నియామక పత్రాన్ని అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నూతన పట్టణ మైనార్టీ సెల్ వైస్ ప్రెసిడెంట్ గా నియమితులైన ఖురేషి మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ ఈ బాధ్యతలను అప్పగించినందుకు నమ్మకంగా పనిచేసే కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేస్తానని తెలిపారు. సీఎం కేసీఆర్ మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని తీరని మోసానికి గురి చేశారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తేనే మైనార్టీలకు అభివృద్ధి సాధ్యపడుతుందని మైనార్టీ లందరినీ ఏకం చేసి కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేసి వికారాబాద్లో ఎమ్మెల్యేగా ప్రసాద్ కుమార్ నుగెలిపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చిగుళ్లపల్లి రమేష్ కుమార్ కౌన్సిలర్ చందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *