వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 20: మైనార్టీల కు అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే జరుగుతుందని టిపిసిసి మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి వహీద్ మియా పేర్కొన్నారు. బుధవారం ఇటీవలే మైనార్టీ సెల్ టిపిసిసి ప్రధాన కార్యదర్శిగా నియమితులైన వహీద్ మియా మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వహీద్ మియా మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ముస్లిం మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించడం జరిగిందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి ముస్లిం మైనారిటీలకు మోసం చేసిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలోని ముస్లిం మైనార్టీల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ముస్లిం మైనార్టీల విద్యాభివృద్ధికి కృషి జరిగిందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనేక హామీలు ఇచ్చి బడుగు బలహీన వర్గాలను సీఎం కేసీఆర్ వాటిని అమలు చేయకుండా తీరని మోసం చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అన్ని వర్గాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలు చేస్తుందన్నారు.



