మైనార్టీలంతా కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, నవంబర్ 15: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే మైనార్టీలకు ప్రాధాన్యం ఇచ్చి అభివృద్ధికి సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతుందని మైనార్టీ సోదరులంతా కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని మాజీమంత్రి ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్  సెక్రెటరీగా లాల్ మహమ్మద్ హుస్సేన్, మహమ్మద్ లాల్ మహమ్మద్ ను వైస్ సెక్రెటరీగా ను నియమిస్తూ మాజీ మంత్రిప్రసాద్ కుమార్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్థ సుధాకర్ రెడ్డి జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు అమిద్ అన్సారి నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షులు సర్పరాజ్ పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షులు హాజీ పాషా లు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ మైనార్టీలను అంతా ఏకం చేస్తూ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేయాలని సూచించారు. ప్రతి నాయకుడు కార్యకర్త కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *