మైండ్‌ ‌స్పేస్‌ ‌నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు…

  • రాయదుర్గం వద్ద మెట్రో లైన్‌కు సిఎం కెసిఆర్‌ ‌శంకుస్థాపన
  • మూడేళ్లలో పనులు పూర్తయ్యేలా చర్యలు
  • ఔటర్‌ ‌చుట్టూ మెట్రో విస్తరణ
  • కేంద్ర సహకారం లేకున్నా పూర్తి చేసితీరుతాం
  • పవర్‌ ఐలాండ్‌గా హైదరాబాద్‌ ‌నగరం
  • నగర ఖ్యాతిని మరింత పెంచుతామన్న సిఎం

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 9 : ‌హైదరాబాద్‌ ‌నగర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌శుభవార్త వినిపించారు. భవిష్యత్‌లో హైదరాబాద్‌ ఔటర్‌ ‌రింగ్‌ ‌రోడ్డు చుట్టూ మెట్రోను విస్తరిస్తామని కేసీఆర్‌ ‌ప్రకటించారు. కేంద్ర సహకారం ఉన్నా లేకున్నా.. మెట్రోను విస్తరిస్తామని సీఎం స్పష్టం చేశారు. మైండ్‌ ‌స్పేస్‌ ‌నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వరకు 31 కిలోవి•టర్ల మేర నిర్మించనున్న మెట్రో పనులకు సీఎం కేసీఆర్‌ ‌శుక్రవారం శంకుస్థాపన చేశారు. రాయదుర్గం నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్ ‌వరకూ 31 కి.వి•. మేర మెట్రో లైన్‌ను నిర్మించనున్నారు. రూ.6,250 కోట్ల అంచనాతో ఈ మెట్రో నిర్మాణం జరగనుంది. వొచ్చే మూడేళ్లలో నిర్మాణం పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ నిర్మాణం పూర్తయితే ఎయిర్‌పోర్టుకు 20 నిమిషాల్లోనే వెళ్లవచ్చు. ఈ సందర్భంగా రాజేంద్రనగర్‌ ‌పోలీసు అకాడవి•లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్‌ ‌పాల్గొని ప్రసంగించారు. మైండ్‌ ‌స్పేస్‌ ‌నుంచి ఎయిర్‌పోర్టు వరకు సుమారు 31 కిలోవి•టర్ల దూరం..వందకు వంద శాతం రాష్ట్ర ప్రభుత్వం, హెచ్‌ఎం‌డీఏ, జీఎంఆర్‌ ‌నిధులతో ప్రారంభం చేసుకుంటున్నామని తెలిపారు. ఈ సందర్భంగా అందరికీ హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నానని కేసీఆర్‌ ‌చెప్పారు.  ప్రంపచంలో కాలుష్య రహిత మైనటువంటి, ట్రాఫిక్‌ ‌రద్దీని నివారించగలిగేటువంటి ఏకైక మార్గం మెట్రో. హైదరాబాద్‌లో ఇంకా విస్తరించాల్సి ఉంది.

బీహెచ్‌ఈఎల్‌ ‌నుంచి మెట్రో రావాల్సి ఉంది. హైదరాబాద్‌ ‌చుట్లూ మెట్రో రావాల్సి ఉంది. కేంద్రం సహకారం ఉన్నా లేకున్నా ఆ సౌకర్యాలు కలిగించుకుంటామని కేసీఆర్‌ ‌తెలిపారు. హైదరాబాద్‌ ‌నగర ఎమ్మెల్యేలు, మంత్రులు, ముందుకు పురోగమిస్తున్నారు.  రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారం, ఆర్థిక ప్రేరణ ఇస్తుందని కేసీఆర్‌ ‌స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని, కెటిఆర్‌, ‌మహ్మూద్‌ అలీ, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, ఎంపిలు కేశవరావు, రంజిత్‌ ‌రెడ్డి,మేయర్‌ ‌విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *