మేమెంత మీ వెంటే మీ సేవలో తుది శ్వాస వరకు

 జన హృదయుని జన సంద్రం
 జనం అంత జన హృదయుని వెంటే.హరీష్ రావు క్యాంప్ కార్యాలయం అభిమానుల… ప్రజా కొలహలం
 5 గంటల పాటు కిక్కిరిసిన సిద్దిపేట క్యాంప్ కార్యాలయం
సిద్ధిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 7: జనం అంత జన హృదయుని వెంటే అంటూ గురువారం సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంప్ కార్యాలయం అంత జన సంద్రంగా మారింది. భారీ మెజారిటీ తో సిద్దిపేట ఎమ్మెల్యే గా గెలిచిన తరవాత తొలి సారి సిద్దిపేట కు వచ్చిన సందర్బంగా గురువారం రోజున క్యాంప్ కార్యాలయం ప్రజల తో… అభిమానులతో కొలహాలంగా మారింది… ” మీరు ఎక్కడ ఉన్న… ఎలా ఉన్న మేము అంత మీ వెంటే అంటూ… మీరు జనం నుండి వచ్చిన నేత… జనం మీ వెంటే ఉంటుంది అంటూ హరీష్ రావు గారిని కల్సి చెప్పారు… ఒక వైపు పార్టీ శ్రేణులు… ప్రజలు… అభిమానులు.. అసోసియేషన్స్.. అదికారులు, జర్నలిస్ట్ లు అన్ని సంఘాలు కలిశారు…
సిద్దిపేట ప్రజా సేవలో తుది శ్వాస వరకు
ఉద్యమ నాటి నుండి నేటి వరకు సిద్దిపేట ప్రజలు చుపిన ప్రేమ ఆప్యాయత మరువ లేనిది.. ఢిల్లీ కి రాజు అయిన తల్లి కి కొడుకు అనే విధంగా పదవి ఉన్న… పదవి లేకున్నా సిద్దిపేట ప్రజల కుటుంబ సభ్యునిలా మీ సేవలో ఉన్న అని ఎమ్మెల్యే హరీష్ రావు గారు అన్నారు.. మీరు ఇచ్చిన మెజారిటీ మీ  గొప్ప ప్రేమ.. ఆప్యాయత గల సిద్దిపేట ప్రజల మనసు ను నా గుండె ల్లో పెట్టుకుంట అంటూ… తుది శ్వాస వరకు మీ సేవలో ఉంటానాని హరీష్ రావు గారు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *