కీసర, ప్రజాతంత్ర , నవంబర్ 14 : మేడ్చల్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని దమ్మాయిగూడ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సామల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆయన మంగళవారం దమ్మాయిగూడ లో మాట్లాడుతూ ప్రజలు బిఆర్ఎస్ పాలనలో విసిగిపోయి కాంగ్రెస్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. బి ఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఏవి కూడా పూర్తిగా అమలు చేయలేదని ద్వజమెత్తారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను వంచనకు గురి చేసిందని పేర్కొన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని కాదని బిఆర్ఎస్ పార్టీకి అధికారం ఇస్తే తగిన గుణపాఠం చెప్పారని ప్రజలు గ్రహించారన్నారు. ఎన్నికల సమయంలో బిఆర్ఎస్ చేసే జిమ్మిక్కులను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదని విమర్శించారు. మేడ్చల్ లో, తెలంగాణ రాష్ట్రంలో విజయం సాధించేది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు.
మేడ్చల్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు – కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సామల శ్రీనివాస్ రెడ్డి





