ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 23 : శాంతియూత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని అమనగల్లు ఎస్సై బాల్ రామ్ నాయక్ కోరారు. అమనగల్లు మండలంలోని మేడిగడ్డ తండా, శంకర్ కొండ తండా గ్రామపంచాయతీ ల మధ్య ఉన్న కత్వా వాగు చెరువు దగ్గర గణేష్ నిమజ్జనం ఏర్పాటు పనులను శనివారం ఉపసర్పంచ్ మల్లేష్, గ్రామ యూవ నాయకుడు విజయ్ రాథోడ్ లతో కలిసి పరిశీలించారు, ఈ సందర్భంగా ఎస్సై బాల్ రామ్ నాయక్ మాట్లాడుతూ నిమజ్జనం సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని ఉపసర్పంచ్ మల్లేష్ కు సూచించారు, గణేష్ నిమజ్జన వేడుకల్లో భాగంగా చెరువు వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై పోలీసులు పలు సూచనలు చేశారు, ఈ కార్యక్రమంలో కిషన్, బీమా, నవీన్, వినోద్, వసంత్, గోపి, సీతారాం, శ్రీను, రమేష్, చంటి, కుమార్ పాల్గొ..



