ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు
న్యూదిల్లీ, ఫిబ్రవరి 21 : ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ, తెలంగాణ కుంభమేలాగా పిలిచే మేడారం సమ్మక్క సారక్క జాతర మంగళవారం నుంచి ప్రారంభం అయిన సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ‘మేడారం జాతర.. గిరిజనుల అతిపెద్ద పండుగల్లో ఒకటి. ఈ జాతర భక్తి, సంప్రదాయం, సమాజ స్ఫూర్తిల గొప్ప కలయిక. మనం సమ్మక్క` సారక్కలకు ప్రణమిల్లుదాం. వారు అభివ్యక్తీకరించిన ఐక్యతా స్ఫూర్తిని, పరాక్రమాన్ని గుర్తు చేసుకుందాం. మన సాంస్కృతిక వారసత్వానికి చిరకాల స్ఫూర్తిగా నిలిచే ఈ సమ్మక్క`సారక్క మేడారం జాతర ప్రారంభోత్సవానికి శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశారు.





