మేడారంలో పూజారుల అతిధి గృహ సముదాయ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి కొండా సురేఖ

 ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సీతక్క

ములుగు, ప్రజాతంత్ర ,జనవరి 17 : ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం లో పూజారులు అతిధి గృహం సముదాయ నిర్మాణా పనులకు మంత్రి  కొండా సురేఖ శంకుస్థాపన చేశారు. దేవాదాయ శాఖ మంత్రి హోదాలో మొదటి సారి గా కొండా సురేఖ మేడారం లోని వన దేవతలను సందర్శించుకున్నారు.ఈ సందర్బంగా దేవాదాయ  రూ.1.5 కోట్లు రూపాయలతో  నూతనంగా నిర్మించే మేడారం పూజారులకు ప్రత్యేక అతిధి గృహం సముదాయ పనులకు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క హాజరు అయ్యారు.ఈ సందర్బంగా మంత్రులు మాట్లాడుతూ మేడారం గిరిజన జాతర లో పూజారులు పాత్ర కీలకం గా ఉంటుంది అని వారి కోసమే ప్రత్యేకంగా ప్రభుత్యం  10 గదులలో అతిధి గృహ నిర్మాణం చేపడుతుందని  వచ్చే జాతర సమయానికి ఈ అతిధి గృహం అందుబాటులోకి వస్తుందని అన్నారు.నిర్మాణ పనులు నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ జరగాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, ఎస్పీ శభరిష్‌ , అటవీ అధికారి రాహుల్‌ కిషన్‌ జాదవ్‌ఐ,టిడిఏ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ అంకిత్‌, అదనపు కలెక్టర్‌ ( స్థానిక సంస్థలు ) పి శ్రీజ , అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) వేణుగోపాల్‌  దేవాదాయ శాఖ అధికారి  ,ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *