తురా, జులై 25 : మేఘాలయా ముఖ్యమంత్రి కన్రాడ్ సంగ్మా కార్యాలయంపై ఆందోళనకారులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. దీంతో తురాలోని సీఎం ఆఫీస్ దగ్గర తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పాడ్డాయి. ఆందోళనకారుల దాడిలో ఐదుగురు భద్రతా సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. తురాలో శీతాకాల రాజధాని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకారులు సీఎం కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ క్రమంలో సీఎంఓపై రాళ్లవర్షం కురిపించారు. ఆ సమయంలో ముఖ్యమంత్రి సంగ్మా ఆఫీసులోనే ఉన్నారు. అయితే ఆయనకు ఎలాంటి హానీ జరగలేదు.



