మేఘాలయలో ‘డోనర్‌’ ప్రాజెక్టుల పురోగతి భేష్‌

– పర్వత ప్రాంత ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తుండటం సంతోషం
– రాష్ట్రంలో కేంద్ర పథకాల అమలుపై కేంద్ర మంత్రి బండి సమీక్ష

షిల్లాంగ్‌, ఆగస్టు 23: మేఘాలయ రాష్ట్రం షిల్లాంగ్‌లో ఐఐఎం, ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూం, ఐటీ పార్క్‌లను కేంద్ర హోం శాఖ మంత్రి బండి సంజయ్‌ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా మేఘాలయలో నార్త్‌ గోరో హిల్స్‌ జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన డోనర్‌ (డెవలెప్‌మెంట్‌ ఆఫ్‌ నార్త్‌ ఈస్టర్న్‌ రీజియన్‌) ప్రాజెక్టుల పురోగతి భేష్‌ అని ఆయన అభినందించారు. ముఖ్యంగా ఆకాంక్షిత జిల్లాలు, బ్లాక్‌లలో (ఆస్పిరేషన్‌ డిస్ట్రిక్ట్స్‌) కేంద్ర సంక్షేమ పథకాలు విజయవంతంగా ప్రజలకు అందించేందుకు అధికారులు కృషి చేస్తున్నారన్నారు. మేఘాలయ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి సంజయ్‌ రాజ్‌భవన్‌లో గవర్నర్‌ విజయ్‌ కుమార్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. జిల్లాలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై స్థానిక కలెక్టర్‌ కలెక్టర్‌ అభిషేక్‌ షైనీ మంత్రికి వివరించారు. మోదీ ప్రభుత్వం వచ్చాక కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పట్ల మేఘాలయ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని పలువురు అధికారులు కేంద్ర మంత్రికి వివరించారు. పర్వత ప్రాంతాల్లో కూడా కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను విజయవంతంగా ప్రజలకు అందిస్తున్న అధికారులను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి ఇప్పటిదాకా రూ.2లక్షల కోట్ల నిధులను వెచ్చించిందని వివరించారు. మేఘాలయ చీఫ్‌ సెక్రటరీ షకీల్‌ అహ్మద్‌, పలువురు ఐఏఎస్‌ అధికారులు సమీక్షలో పాల్గొన్నారు. అంతకుముందు న్యూ షిల్లాంగ్‌లోని వైద్య సంస్థ అయిన నేగ్రీమ్స్‌ ఆయుర్వేద వైద్య సంస్థ నియా, స్టాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్‌ ఆఫ్‌ ఇండియా పార్కులను సందర్శించారు. ఐటీ పార్కులో కార్యకలాపాలను నిర్వర్తిస్తున్న ఐ మెరిట్‌, 24/7. ఏఐ లాంటి పలు కంపెనీల ప్రతినిధులతో కేంద్ర మంత్రి ముచ్చటించారు. స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తున్న కంపెనీలను అభినందించారు అనంతరం ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను సందర్శించి ఆ సంస్థ పనితీరును పరిశీలించారు నిర్మాణంలో ఉన్న ఐఐఎం సహా పలు ప్రాజెక్టుల పురోగతిని కూడా అధికారులను అడిగి తెలుసుకున్నారు.


 

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండిరగ్‌ వీడియోల కోసం Prajatantra వెబ్‌సైట్‌ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్‌ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్‌ను ఫాలో కండి. అలాగే మా ప్రజాతంత్ర యూట్యూబ్‌ చానల్‌ను సబ్‌ స్క్రైబ్‌ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్‌ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్‌ చేయడం మరిచిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *