మెట్రో మార్గంలో మార్పులు

 రాయదుర్గం` ఎయిర్‌ పోర్టు ప్లాన్‌ రద్దు..మారో మార్గం కోసం ప్లాన్‌
కొత్త భవనాల నిర్మాణం ఉండదు
అందరితో చర్చించి అవసరమైనప్పుడు శ్వేత పత్రాలు
నేటి గవర్నర్‌ ప్రసంగానికి కేబినేట్‌ ఆమోదం
మీడియాతో చిట్‌చాట్‌లో సిఎం రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 14 : రాయదుర్గం` ఎయిర్‌ పోర్ట్‌ మెట్రో ఉపయోగకరంగా ఉండదని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలిపారు. విమానాశ్రయానికి మరో మార్గంలో మెట్రో మార్గం ప్లాన్‌ చేస్తామన్నారు. ఈ సందర్బంగా రేవంత్‌ రెడ్డి బిఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. బిఆర్‌ఎస్‌ సర్కార్‌ 12,14 గంటలకు మించి కరెంట్‌ ఇవ్వలేదని ఆరోపించారు. అన్ని అంశాలపై, అందరితో చర్చించి శ్వేతపత్రాలు విడుదల చేస్తామ న్నారు. బిఎసీలో సమావేశాల ఎజెండాపై నిర్ణయం తీసుకుంటామన్నారు. తన నివాసం కోసం  ఎంసిఆర్‌ హెచ్‌ఆర్డీలోని ఖాళీ స్థలాన్ని వినియోగించు కుంటా మన్నారు. ప్రజాభవన్‌ లో కార్యాలయాన్ని యథావిధిగా ఉపయోగిం చుకుంటానని సిఎం తెలిపారు. కొత్తగా ఎలాంటి భవనాలు నిర్మించబోమని స్పష్టం చేశారు. కొత్తగా వాహనాలు కూడా కొనుగోలు చేయమన్నారు. శాసనసభ భవనాలను సమర్థంగా వినియోగించు కుంటామని రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. పాత అసెంబ్లీ బిల్డింగ్‌లో కౌన్సిల్‌ సమావేశాలు, ఇప్పుడు ఉన్న అసెంబ్లీలో శాసనసభ జరుగుతుందని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు.

గురువారం విూడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో సీఎం మాట్లాడుతూ.. పార్లమెంట్‌ తరహాలో అసెంబ్లీ ఉండబోతుందని అన్నారు. ఎంసీహెచ్‌ఆర్డీలో ఉన్న కాళీ స్థలంలో తన క్యాంపు ఆఫీస్‌ నిర్మాణం చేస్తామన్నారు. ప్రజా భవన్‌లో ఇంకో బిల్డింగ్‌ ఉందని..అది ఇంకో మంత్రికి ఇస్తామన్నారు. రాయదుర్గం నుంచి ఎయిర్‌పోర్ట్‌కు మెట్రో ఉపయోగకరం గా ఉండదని.. మరోరూట్‌లో మెట్రో ప్లాన్‌ చేస్తామని సీఎం తెలిపారు. శ్వేతపత్రాలు సహా అన్ని అంశాలపై అందరితో చర్చించి సమయం వొచ్చినప్పుడు విడుదల చేస్తామని తెలిపారు. శాసనసభ సమావేశాల ఎజెండాపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. గవర్నర్‌ ప్రసంగానికి కేబినెట్‌ ఆమోదం తెలిపిందని సీఎం రేవంత్‌ రెడ్డి వెల్లడిరచారు. ఇదిలావుంటే తెలంగాణ కేబినెట్‌ భేటీ ముగిసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో గవర్నర్‌ ప్రసంగానికి ఆమోదం లభించింది.

శుక్రవారం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రసంగించనున్నారు. గవర్నర్‌ ప్రసంగంలో ఉండాల్సిన అంశాలపై కేబినెట్‌ భేటీలో చర్చించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలి ప్రసంగం కావడంతో ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వాలనే దానిపై సుమారు గంటన్నరపాటు చర్చ జరిగింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఎలాంటి పరిస్థితిలో ఉంది..రానున్న రోజుల్లో ఎలా ఉండబోతోందనే అంశాలతో గవర్నర్‌ ప్రసంగం ఉండనున్నట్లు తెలుస్తుంది. ఎన్నికల హావిూల్లో భాగంగా ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే రెండిరటిని ప్రభుత్వం మొదలుపెట్టిన విషయం తెలిసిందే. మిగతా నాలుగు గ్యారంటీల అమలుపై మంత్రివర్గ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. అనంతరం గవర్నర్‌ ప్రసంగాన్ని ఆమోదిస్తూ కేబినెట్‌ తీర్మానం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *