మృతుల కుటుంబాలకు జర్పుల రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహాయం అందజేత 

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 26 :  కడ్తాల మండలంలోని చరికొండ గ్రామపంచాయతీ పరిధిలో వారం రోజుల క్రితం వసంత, బాదం జయమ్మలు మృతి చెందారు. విషయం తెలుసుకున్న గ్రామీణాభివృద్ధి స్టాండింగ్ కమిటీ జిల్లా సభ్యులు కడ్తాల్ జెడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్ గురువారం చరికొండ గ్రామానికి చేరుకొని వసంత కుటుంబాన్ని అలాగే జయమ్మ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం జర్పుల రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒక్కోక్కరి కుటుంబానికి రూ. 5 వేల చొప్పున రెండు కుటుంబాలకు పదివేల రూపాయల ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ వెంకటేష్, వైస్ ఎంపీపీ ఆనంద్, మండల పార్టీ అధ్యక్షుడు పరమేష్, రైతు కోఆర్డినేటర్ జోగు వీరయ్య, సర్పంచులు  భారతమ్మ, నరసింహ, లక్ష్మీ నరసింహ రెడ్డి, ఉప సర్పంచ్ నరేష్, వినోద్, నాయకులు జంగయ్య, సాబేర్, నరసింహ, అంజి, గోపాల్, శ్రీను, వెంకటయ్య మునివర్ దర్గయ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *