మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేత

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 23 :  కడ్తాల మండలంలోని వివిధ గ్రామాల్లో మృతి చెందిన మృతుల కుటుంబాలకు జర్పుల రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒక్కో కుటుంబానికి రూ. 5వేల చొప్పున ఇది కుటుంబాలకు 10 వేల ఆర్థిక సాయం అందించారు. కడ్తాల మండల కేంద్రానికి చెందిన మాదారం నవీన్ మృతి చెందారు. అదేవిధంగా రావిచెడు గ్రామపంచాయతీ పరిధిలోని మద్దెలకుంట తండాకు చెందిన ఎన్. రామంజ మృతి చెందారు. ఇరువురి కుటుంబ సభ్యులను గ్రామీణాభివృద్ధి స్టాండింగ్ కమిటీ జిల్లా సభ్యులు కడ్తాల జెడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్ పరామర్శించారు. అనంతరం ఒక్కొక్క కుటుంబానికి 5వేల చెప్పుల 10, వేలు ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ వెంకటేష్, మండల పార్టీ అధ్యక్షుడు పరమేష్,   రైతు కోఆర్డినేటర్ వీరయ్య, ఐక్యవేదిక అధ్యక్షులు రాఘవేందర్, ఎంపిటిసి ప్రియా రమేష్, మంజుల చంద్రమౌళి,  సర్పంచ్ సులోచన సాయిలు, ఉపసర్పంచ్ రామకృష్ణ,  నాయకులు గణేష్, తిరుపతి, భాస్కర్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *