మృతురాలి కుటుంబానికి రాధాకృష్ణ ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహాయం అందజేత

 ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 18 : కడ్తాల మండలంలోని మర్రిపల్లి  గ్రామపంచాయతీకి చెందిన నల్లవెల్లి నరసమ్మ గత వారం రోజుల క్రితం అనారోగ్య కారణాలతో మృతి చెందారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న గ్రామీణాభివృద్ధి స్టాండింగ్ కమిటీ జిల్లా సభ్యులు, కడ్తాల జెడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్ మర్రిపల్లి గ్రామానికి చేరుకొని నరసమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించారు. తదుపరి జర్పుల రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నరసమ్మ కుటుంబ సభ్యులకు రూ. 5. వేల ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ వెంకటేష్, వైస్ ఎంపీపీ ఆనంద్, రైతు కోఆర్డినేటర్ వీరయ్య, ఎంపీటీసీ లచ్చిరాం, సర్పంచ్ భాగ్యమ్మ, జంగయ్య, ఉప సర్పంచ్ నరసింహ, వార్డు సభ్యులు సత్యం, భాస్కర్ రెడ్డి, జంగయ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *