జగదేవపూర్ ప్రజాతంత్ర, డిసెంబర్ 30: జగదేవపూర్ మండల కేంద్రంలో గత కొంతకాలంగా అనారోగ్యంతో బాదపడుతూ శనివారం మృతి చెందిన వృద్ధురాలు రాచకొండ రాజమ్మ (90) కుటుంబానికి మండల రజక సంఘం నాయకులు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా గజ్వేల్ నియోజకవర్గ రజక సంఘం అధ్యక్షుడు రాచమల్ల ఎల్లేష్ ఆధ్వర్యంలో పలువురు రజక సంఘం నాయకులు మృతురాలు రాజమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించి మండల రజక సంఘం తరపున రూ. 5000లు ఆర్థిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో మండల రజక సంఘం అధ్యక్షులు అక్కారం నర్సింలు, ఉపాధ్యక్షులు వడ్లకొండ శ్రీనివాస్, రాచకొండ యాదగిరి, సంయుక్త కార్యదర్శులు రాచమల్ల నర్సింలు, రాచకొండ శ్రీను, బస్వరాజు ఏగొండ, పలువురు గ్రామ రజక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మృతురాలి కుటుంబానికి రజక సంఘం ఆర్థిక సహాయం




