ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 2 : కడ్తాల్ మండలం మైసిగండి గ్రామానికి చెందిన బాణావత్ నాజి ఆరోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న గ్రామపంచాయతీ ఏడవ వార్డు మెంబర్ సభావట్ రాందాస్ నాయక్ వారి కుటుంబ సభ్యులకు పరామర్శించి ఓదార్చారు. అనంతరం రూ.5 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో పెద్దలు బిచ్యా నాయక్, పంతు నాయక్, రాజు నాయక్, దసరత్ నాయక్, పాండు నాయక్, లక్ష్మణ్ నాయక్, మురారి, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.



