మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 19 : కడ్తాల గ్రామానికి చెందిన పసుపులేటి నారమ్మ మృతి చెందారు. స్థానిక యువకుల నుండి విషయం తెలుసుకున్న కడ్తాల్ మండల జడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్ కుటుంబాన్ని పరామర్శించి వారికి మనోధైర్యాన్ని కల్పించారు. వారి కుటుంబానికి రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ నుండి రూ. 5వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో కడ్తాల్ మండల రైతు కోఆర్డినేటర్ జోగు వీరయ్య, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా డీసీసీబీ డైరెక్టర్, ఉమ్మడి ఆమనగల్లు, కడ్తాల మండలాల పిఎసిఎస్ చైర్మన్ గంప వెంకటేష్, మండల వైస్ ఎంపీపీ ఆనంద్, గ్రామ టిఆర్ఎస్ యూత్ వింగ్ అధ్యక్షులు కొప్పు కృష్ణ, దేవా నాయక్, శ్రీకాంత్, కాలే శీను, మల్లేష్ మణికంఠ, శివ, పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *