మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 15 : కడ్తాల మండల పరిధిలోని గోవిందాయపల్లి తాండకు చెందిన సబావట్ నాజీ మృతి చెందారు. విషయం తెలుసుకున్న జిల్లా గిరిజన మోర్చా ప్రధాన కార్యదర్శి బాణావత్ సాయిలాల్ నాయక్ మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. అనంతరం రూ. 5వేల ఆర్థిక సహాయాన్ని నాజీ కుమారుడు తవుర్య కు అందించారు.  ఈ కార్యక్రమంలో మాన్య, నరేందర్, రెడ్యానాయక్, మల్లేష్, జోగ్య, శ్రీను, దశరత్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *