ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 28 : కడ్తాల మండలంలోని గానుగమర్ల గ్రామపంచాయతీ పరిధిలోని కానుగుబాయి తండా చెందిన నెనావత్ ధోళి మృతి చెందారు. విషయం తెలుసుకున్న జడ్పిటిసి దశరథ్ నాయక్ సతీమణి శారద మృతురాలి ధోళి ఇంటికి చేరుకుని ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ధోళి మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. తదుపరి జర్పుల రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ధోళి కుటుంబానికి రూ.5వేల ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శారద పాండు, వార్డు సభ్యులు లక్ష్మణ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు భిక్య నాయక్, టిక్ లాల్, రాజు, పాండు, లక్ష్మణ్, బాలు, శ్రీను, నర్సింగ్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
మృతుడి కుటుంబానికి రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక సహాయం అందజేత





