ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 9 : కడ్తాల పట్టణానికి చెందిన ఓర్సు రాములయ్య గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ నిన్న రాత్రి మృతి చెందారు.. ఈ విషయం తెలుసుకున్న కడ్తాల్ సర్పంచ్ గూడూరు లక్ష్మీ నరసింహ్మ రెడ్డి (LN రెడ్డి) వారి కుటుంబాన్ని పరామర్శించి కుటుంబ సభ్యులకు రూ.5, వేల ఆర్థిక సాయం అందజేసి వారికి మనోధైర్యాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో గండికోట యాదయ్య, బోసు వెంకటేష్, రేపని యాదయ్య, వరికుప్పల వెంకటేశ్, సురేష్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.



