ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 1 : తలకొండపల్లి మండల పరిధిలోని వెల్జాల్ గ్రామానికిచెందిన వానరాశి జంగయ్య మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ స్థానిక జెడ్పిటిసి ఉప్పల వెంకటేష్ మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ తన ట్రస్టు ద్వారా రూ. 3వేల ఆర్థిక సహాయం రాజు ద్వార అందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాఘవేందర్ యాదవ్, పులిజాల శేఖర్ తదితరులు పాల్గొన్నారు.



