మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన రజక సంఘం నాయకులు

జగదేవపూర్,ప్రజాతంత్ర,అక్టోబర్ 25: జగదేవపూర్ మండల పరిధిలోని తీగుల్ గ్రామంలో మంగళవారం సాయంత్రం అనారోగ్యంతో మృతి చెందిన రాచమల్ల చంద్రమౌళి 46 వయసు కుటుంబ సభ్యులను బుధవారం మండల రజక సంఘం నాయకులు పరామర్శించి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మండల రజక సంఘం అధ్యక్షుడు రాచమల్ల ఎల్లేష్ ఆధ్వర్యంలో పలువురు రజక నాయకులు మృతుడి కుటుంబాన్ని పరామర్శించి రూ.5000 /- ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు అక్కారం నర్సింలు, ఉపాధ్యక్షులు వడ్లకొండ శ్రీనివాస్, రాచమల్ల శ్రీనివాస్, కోశాధికారి రాచకొండ బాల్ నర్సయ్య, రజక సంఘం నాయకులు రాచకొండ సీతయ్య, కుమార్, స్వామి, నాగరాజు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *