జగదేపూర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 25 : పారిశుధ్య కార్మికుల కుటుంబాలను మానవతాముర్తులు ఆదుకోవాలని మట్టి మనిషి పౌండేషన్ చైర్మన్ కె. పరశురామ్ అన్నారు. జగదేవపూర్ మండలంలోని తిగుల్ గ్రామానికి చెందిన ముగ్గురు పారిశుద్ధ్య కార్మికులు ఇటివల బతుకమ్మ చెరువులో ప్రమాదవశాత్తు పడి మృతి చెందారు. బుధవారం సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షుడు నరేష్ గుప్త సహకారంతో మట్టి మనిషి పౌండేషన్ ఆధ్వర్యంలో మృతుల కుటుంబాలకు యాబై కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పని చేస్తే కానీ డొక్కాడని, పూటగడిచే కుటుంబాలు ప్రమాదవశాత్తు మృతి చెందడం చాలా బాధకరమన్నారు. ప్రభుత్వం ఆ కుటుంబాలకు అండగా నిలువాలని కోరారు. అలాగే మానవతా ధృడ సంకల్పంతో పారిశుధ్య కార్మికుల కుటుంబాలను ఆదుకోవడానికి ప్రతి ఒకరు తమవంతు సహాయ సహకారాలు అందించి అండగా నిలువాలన్నారు.ఈ కార్యక్రమంలో సభ్యులు జర్నలిస్టు నరేష్, ఉప్పలయ్య, ఐలయ్య, కనకయ్య, ప్రభాకర్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
మృతి చెందిన పారిశుద్ధ్య కార్మికులకు బియ్యం అందజేత



