- నాలాల నుంచి వరద రాకుండా చర్యలు
- నాగోల్ నుంచి ఎల్బి నగర్‌కు మెట్రోను కలిపే ప్రయత్నం
- హైదరాబాద్‌లో సమగ్రాభివృద్ధికి కృషి
- ఎల్బీనగర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి కెటిఆర్ శ్రీకారం
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 6 : హైదరాబాద్ నగరం శరవేగంగా విస్తరిస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. ముందు అభివృద్ధి తర్వాతే రాజకీయం అని ఆయన చెప్పారు. అయ్యప్ప కాలనీలోకి ఇకపై వరద నీరు రాదని అన్నారు. ఎల్బీనగర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను కేటీఆర్ ప్రారంభించారు. హైదరాబాద్ చుట్టూ ఉండే మున్సిపాలిటీల్లో రూ.220 కోట్లతో అభివృద్ధి పనులను చేస్తున్నామని ఆయన తెలిపారు. ప్రతి ఏడాది సుమారు 28 రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో ప్రజలు హైదరాబాద్‌కు వొచ్చి నివాసం ఉంటున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు.
ప్రజల అవసరాలకు తగ్గట్టుగా అభివృద్ధి పనులు జరిపిస్తామని తెలిపారు. రూ.985 కోట్లతో నాలాల పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఇక మూసీనదిపై 14 కొత్త బ్రిడ్జిలను త్వరలో కట్టబోతున్నామని కేటీఆర్ అన్నారు. రూ.84 లక్షలతో జంతువుల కోసం పెట్ ఆడిటోరియంను ఏర్పాటు చేశామన్నారు. రాబోయే రోజుల్లో ఆటోనగర్‌లో ప్లవర్ గార్డెన్‌ను ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇప్పుడు హైదరాబాద్‌లో ఏ మూలకు పోయినా పచ్చదనం కనిపిస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.16 కోట్లతో ముక్తిఘాట్ నిర్మించామని తెలిపారు. రూ. 985 కోట్లతో నాలాల ఆధునీకరణ పనులు చేపట్టామన్నారు. ఫిర్జాదీగూడ దగ్గర రూ.52 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం చేశామని అన్నారు.
హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 14 బ్రిడ్జ్‌లు కట్టనున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. తెలంగాణలో మళ్లీ వొచ్చేది తెలంగాణ ప్రభుత్వమేనని, ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆరేనని మంత్రి కేటీఆర్ అన్నారు. ‘నాగోల్, ఎల్బీ నగర్ వరకు మెట్రో పూర్తయ్యింది. నాగోల్ నుంచి ఎల్బీనగర్ మధ్య ఐదు కిలోవి•టర్ల మార్గాన్ని రెండో ఫేజ్‌లో కలిపే ప్రయత్నం చేస్తాం. రేపే చేస్తామని చేయలేదని అంటారు. అందుకే ముందుగానే చెబుతున్నా. నాకు తెలుసు..వి•కు తెలుసు. మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేది సీఎం కేసీఆరే..వొచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వమే. వొచ్చే ఎన్నికల తర్వాత ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్ వరకు మెట్రోను విస్తరిస్తాం. ఆ దిశగా ప్రజా రవాణాను విస్తరించే ప్రయత్నం చేస్తాం. టిమ్స్ హాస్పిటల్ గడ్డి అన్నారంలో రాబోతుంది’ అని మంత్రి కెటిఆర్ తెలిపారు.



