ముసుగులు చిత్ర విచిత్రాలు
కనిపెట్టకపోతే కావచ్చు కన్నీటి పర్యంతం
కొన్ని మనసులు దోచుకుంటే
సంపదను, సర్వస్వాన్ని దోచుకునేవి మరికొన్ని
మేలు చేసేవి, కీడు చేసేవి
ఉంటాయి పక్క పక్కనే
విభజన చేసి చూడకపోతే నష్టమే

జోకర్‌ ‌ముసుగులు సర్కస్‌ అసెట్‌
‌నవ్వినా, ఏడ్చినా ఉయ్యాలలూపుతాయి నవ్వుల్లో
బుడ్డరఖాన్‌ ‌వేషాలు రక్తి కట్టిస్తాయి నాటకాన్ని
తన్నులు తిన్నా, తనువుకు గాయాలైనా
హాస్యం పంట తీసేవాడు పంచేది ఆరోగ్య ప్రసాదమే
మారు వేషాలు మంచికైతే చేస్తాయి హీరోను
మబ్బు ముసుగు తొలగిపోతేనే సూర్యోదయం

స్నేహాల ముసుగులో మేక వన్నె పులులు
హామీల ముసుగులో రాజకీయ మోసాలుంటాయి
వాట్సప్‌ ,‌ఫేస్‌ ‌బుక్‌ ‌పరిచయాల వెకిలిచేష్టలు
నగ్న మోసాల మంత్రగత్తెలు
కావ్‌ ‌కావ్‌ ‌మనే శత్రుగుంపులో
ఉంటాయి కొన్ని మిత్ర కోకిలలు
బెల్లం చుట్టూ ఈగలు కొన్ని బంధుత్వాలు
పులేశమేసిన గాడిద ఓండ్ర పెడుతుంది
ముసుగులు తొలగిపోతే వెళ్లడయే నగ్న సత్యాలు
మంచైనా చెడైనా
ముసుగెనుక వేషాలు వెల్లడైతే క్షేమం
అప్పుడప్పుడు
మన ముసుగులు తొలగించాలి
మనల్ని మనం
సొక్కమైన బంగారంలా కరిగించుకోవాలి
పట్టిన శని గ్రహాలను వదిలించుకోవాలి
ప్రాణమిచ్చే స్నేహాలు ఏ ముసుగులో ఉన్నా
కాపాడుకోవాలి కడదాకా
– కొమురవెల్లి అంజయ్య
సిద్దిపేట
9848005676

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *