మున్సిపల్ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలి

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 14 : అమనగల్లు మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులు, సిబ్బందికి రెగ్యులర్ చేసి వేతనాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ గురువారం ఆమనగల్లు మున్సిపల్ చైర్మన్ రాంపాల్ నాయక్, కమిషనర్ శ్యాంసుందర్ లకు సమ్మెకు సంబంధించిన నోటీసులను అందజేశారు. పలువురు మాట్లాడుతూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను, వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించిందని అన్నారు. తమను ఎన్నికల విధులను, ఇతరత్రా పనులను వాడుకొనీ తమను మాత్రం పట్టించుకోవడంలేదని వారు ఆరోపించారు. మున్సిపల్ కార్యాలయంలో బిల్ కలెక్టర్ స్థాయి నుంచి కంప్యూటర్ ఆపరేటర్లు, స్వీపర్లు, కామటీలు, ఎలక్ట్రీషియన్లు పంప్ ఆపరేటర్లు, పారిశుద్ధ్య సూపర్వైజర్లు గా పనిచేయడం జరుగుతుందన్నారు. వీరందరికీ జీవో నెంబర్ 14 ప్రకారం వేతనాలు చెల్లించడం జరుగుతుందని అన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్థానిక ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మా సమస్యలను పట్టించుకోని మున్సిపల్ కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కాంట్రాక్ట్ ఉద్యోగులు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *