స్వేచ్చయుత వాతావరణము లో వోటు హక్కు వినియోగించుకోవాలి
నల్గొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నిక ఈ నెల మూడు న జరుగనుంది. ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అధికార పార్టీ,మరియు భా.జా.పా పార్టీలు ఒక్కొ వోటుకు ఆరు వేల నుండి పది వేల రూపాయల ఇవ్వడం జరుగుతుందని మీడియా లో కథనాలు వెలుబడుతూ వున్నాయి. మునుగోడు ఉప ఎన్నికలో ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశంతో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతుందని, పోలీసులు కూడా అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నరని బీజేపీ,కాంగ్రెసు పార్టీలు ఆరోపణలు చేస్తూ వున్నాయి.మునుగోడు నియోజక వర్గంలో లో ప్రచారం పూర్తి అయినది. ఈనెల మూడవ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఆరవ తారీకు న ఫలితాలు విడుదల కానున్నాయి. నోటిఫికేషన్ విడుదల నుండె ఆయా పార్టీల నేతలు నియోజక వర్గంలో అన్ని గ్రామాలను తిరిగి ప్రచారం చేసారు.సభలు,రోడ్ షోలు కూడా నిర్వహించారు.ఆయా పార్టీల ఆగ్ర నేతలు తమకు కేటాయించిన గ్రామాలు, మండలాలు, పట్టణాలలో మకాం వేసి సమయము వృధా కాకుండా ఓటర్ల ను కలిసి ఓట్లు అడిగారు.మాటల తూటాలు పేలాయి.ప్రతీ రొజు వోటర్ల కి పండగ లాగా మద్యం,మాంసం ,తో విపరీతంగా విందు ఆరగించారు.ఆయా పార్టీల నేతలు నియోజక వర్గం లొ విస్తృతం గా పర్యటన చేస్తూ తమ ప్రసంగాల తో వోటర్ లను ఆకట్టుకునే ప్రయత్నం చేసారు.చివరన కే.సి.ఆర్ చండూరు మండలం లో భహిరంగ సభ నిర్వహించారు.
ఈ సారి కే.టి.ఆర్ మరియు త్రిబుల్ శూటర్ గా పేరు గాంచిన మంత్రి హరీశ్ రావు,వివిధ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు, మాత్రం దూకుడు పెంచి రోడ్ షోలు,సభలు నిర్వహిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ పార్టీ చేసిన అభివృద్ది కార్యక్రమములు వివరిస్తూ తమ పార్టీ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి ని గెలిపించాలని ప్రచారం నిర్వహించడం జరిగింది.వారితో పాటు మం త్రులు గంగుల,కొప్పుల,తలసాని,ఎర్రబెల్లి సత్య వతి, మల్లా రెడ్డి ఆయా నియోజక వర్గాల శాసన సభ్యులు ఇక్కడే మకాం వేసి ప్రచారం చేసారు. భాజపా అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి తాను గతం లో ఇక్కడే శాససభ్యుడిగా గెలిచాలని మళ్లీ ఇక్కడ నుండి మరో మారు గెలిపించాలని ఎన్నో సేవలు చేశానని అని తాను ఏమి తక్కువ కాదు అన్నట్లు కేంద్ర ప్రభుత్వం అభివృద్ది కార్యక్రమాలు వెల్లడిస్తు గులాబీ పార్టీ అవినీతి, అక్రమాలు, వారి లోటు పాట్లు వివరిస్తూ ముందుకు వెళ్ళినారు.కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి,.భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్,రాస్ట్ర ఇంచార్జి తరుణ్ జుగ్, యం.పి అరవింద్,మాజీ యం.పి జితేం దర్ రెడ్డి,మాజీ మంత్రి అరుణ., హుజూరాబాద్ శాసన సభ్యులు ఈటెల రాజేందర్, దుబ్బాక శాసన సభ్యులు రఘునందన్ రావు,మాజీ యం.పి విజయ శాంతి, మిగతా నాయకులు ప్రచారం విస్తృతం గా చేసారు. కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో స్రవంతి తరపున పి.సి.సి. అధ్యక్షుడు రెవంత్ రెడ్డి,మాజీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి మిగతా నేతలు ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలు,అలాగే మునుగోడు ఉప ఎన్నికల్లో నిబంధనల ఉల్లంఘన జరుగుతు ందని, డబ్బు, మధ్యం విచ్చలవిడిగా పంచడానికి ప్రయత్నం చేస్తున్నదని ప్రచారం చేస్తూ వున్నారు.
టి.ఆర్.యస్,భాజపా ల మధ్య చీకటి ఒప్పందం కుదిరిందని అందుకే దొంగ నాటకాలు ఆడుతు న్నయని రేవంత్ రెడ్డి విమ ర్శిస్తున్నారు.ఈ సారి బి.స్.పి పార్టీ కూడా ఎన్నికల లో పోటీ చేస్తుంది.ఆ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ కూడా నియోజక వర్గం లో పర్యటన చేశారు . ప్రజా శాంతి పార్టీ తరపున కే.యే.పాల్ కూడా పోటీ చేస్తూ వున్నారు.ఇప్పటికే ఎన్నికల కమిషన్ నియోజక వర్గంలో 298 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వించనున్నారు.105 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు.ఈ సారి కొత్తగా ఓటు హక్కు పొందిన వారికి తొలి సారిగా ఆధునీకరించిన ఓటరు గుర్తింపు కార్డు లను మంజూరు చేశారు.ఓటరు స్లిప్పులు కూడా పంపిణీ చేశారు.అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేయడం జరిగింది.
మొత్తం 2.41 లక్షల మంది ఓటరు లు ఈ సారి ఓటు హక్కు వినియోగించు కోనున్నారు..పోస్టల్ బ్యాలెట్ ఓటర్లు 5,686 మందికి గాను 730 మంది మాత్రమే ధరకాస్తు చేసుకున్నట్లు అధికారులు చెప్పుతూ వున్నారు.పోలింగ్ మూడవ తేదీన ఉదయం 7గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు జరగ నుంది.సుమారు 100 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఎన్నికల తేదీ సమీపిస్తున్న తరుణం లో రాష్ట్ర రాజకీయం అంతా మునుగోడు చుట్టే తిరుగుతుంది.ఎక్కడ నలుగురు కలిసినా మునుగోడు చర్చే.ఎన్నికల కమిషన్ ఎన్నికలు పారదర్శకంగా,స్వేచ్చ గా జరిగేలా చూడాలని,.ఓటర్లు కూడా ఎలాంటి ప్రలొబాలకు లొంగకుండా తమ ఓటు హక్కు ని స్వేచ్చగా వినియోగించుకుని ప్రజాస్వామ్య విలువలను కాపాడాలి.వోటింగ్ శాతం పెంచేలా కృషి చేయాలి.
– కామిడి సతీష్ రెడ్డీ, జడలపేట,జయశంకర్ భూపాలపల్లి జిల్లా, .9848445134.




