మునుగోడులో కాంగ్రెస్‌ ‌భారీ ర్యాలీ

  • కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి నామినేషన్‌
  • 38‌మందితో స్టార్‌ ‌కాంపెయినర్ల జాబితా విడుదల
  • బిజెపి, టిఆర్‌ఎస్‌లకు బుద్దిచెప్పాలన్న స్రవంతి

నల్లగొండ, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 14 : ‌మునుగోడు కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి నామినేషన్‌ ‌దాఖలు చేశారు. ఇవాళ మధ్యాహ్నం చండూర్‌ ‌లోని తహసీల్దార్‌ ‌కార్యాలయంలో ఆమె కాంగ్రెస్‌ ‌తరఫున నామినేషన్‌ ‌వేశారు. ఈ సందర్భంగా బంగారుగడ్డ గ్రామం నుంచి చండూర్‌ ఎమ్మార్వో కార్యాలయం వరకు పాల్వాయి స్రవంతి భారీ  ర్యాలీగా తరలి వచ్చారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి, ఎంపీ ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి, ఎమ్మెల్యే  సీతక్క, కాంగ్రెస్‌ ‌నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్‌.ఎస్‌.‌యూ.ఐ ఆధ్వర్యంలో చేపట్టిన ’ప్రజాస్వామ్య పరిరక్షణకై పాదాభివందనం’ కార్యక్రమాన్ని టీపీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి మునుగోడు నియోజకవర్గంలోని కొంపల్లిలో ప్రారంభించారు.

నవంబర్‌ 3 ‌వరకు ఎన్‌.ఎస్‌.‌యూ.ఐ నాయకులు నియోజకవర్గంలోని గడపగడపకు తిరిగి పాదాభివందనం కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇక మునుగోడులో కాంగ్రెస్‌ ‌తరఫున ప్రచారం చేసే 38 మంది స్టార్‌ ‌క్యాంపెయినర్ల లిస్టును ప్రకటించారు. ఇందులో మాణిక్కం ఠాగూర్‌, ‌రేవంత్‌ ‌రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి తదితరులు ఉన్నారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ ‌రెడ్డి పేరు కాంగ్రెస్‌ ‌స్టార్‌ ‌క్యాంపెయినర్ల లిస్టులో ఉండటం చర్చనీయాంశంగా మారింది. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం జోరందుకున్నా ఇప్పటికీ ఆయన ఆ నియోజకవర్గంలోకి అడుగుపెట్టలేదు. ప్రచారానికి  దూరంగానే ఉంటున్నారు.

ఈ సందర్బంగా కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి మాట్లాడుతూ  ప్రజా విశ్వాసం కోల్పోయిన టిఆర్‌ఎస్‌ ‌పార్టీకి, డబ్బులతో ఓట్లను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీకి  మునుగోడు ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని  అన్నారు. చెయ్యి గుర్తుకు వోటు వేసి గెలిపించాలని విన్నవించారు. దేశంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, టీఆర్‌ఎ?‌సలు ప్రజలకు చేసిందేవి• లేదన్నారు. గ్రామాల్లో ఎక్కడ చూసినా ఇప్పటికీ కాంగ్రెస్‌ ‌ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధే కనిపిస్తుందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *