ముదిరాజ్ లు, మత్య్సకారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

మహేశ్వరం టౌన్, ప్రజాతంత్ర, ఆగస్టు 14; ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో ఒక్కో కులానికి ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తున్నారని మంత్రి
సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఆదివారం ఓఆర్ఆర్ సమీపంలో రావిర్యాల ప్రగతి సంస్థ వద్ద జరిగిన కార్యక్రమంలో.ముదిరాజ్ భవన నిర్మాణ పనులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కుల, చేతివృత్తులకు కేసీఆర్ ప్రభుత్వం అండగా
నిలబడుతోందన్నారు. ముదిరాజ్ లు కు ఓఆర్ఆర్ పక్కన ఖరీదైన స్థలంలో భవనం నిర్మిస్తున్నామని అన్నారు. ముదిరాజు, మత్య్సకారుల అభివృద్ధికి
ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందన్నారు. చెరువుల్లో ఉచితంగా చేపపిల్లలు వదలటం, అవి చేతి కొచ్చే సరికి మార్కెటింగ్ సౌకర్యాలు కల్పిస్తూ మొబైల్ వాహనాలు అందిస్తూ ప్రోత్సహిస్తోందన్నారు.  కార్యక్రమంలో ఇంద్రారెడ్డి ట్రస్ట్ చైర్మన్ పట్లోళ్ల కార్తీక్ రెడ్డి కమిషనర్ వెంకట్రామ్, పురపాలక వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, కౌన్సిలర్లు, బి ఆర్ ఎస్ నాయకులు, ముదిరాజ్ సంఘ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *