ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉప అధ్యక్షుడు కొట్టల యాదగిరి

గజ్వేల్,ప్రజాతంత్ర, ఆగస్ట్ 12: గజ్వేల్ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు డిప్యూటీ స్పీకర్ బండ ప్రకాష్ ముదిరాజ్ అధర్యంలో ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉప అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన కొట్టాల యాదగిరి, సిద్దిపేట జిల్లా యూత్ విభాగం అధ్యక్షుడిగా ఎన్నికైన అంతయగుడెం సర్పంచ్ తిగుల్ల సత్యం ను  శనివారం ఉమ్మడి మెదక్,సిద్దిపేట జిల్లా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ని నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు.అనంతరం ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉప అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన కొట్టల యాదగిరిని, జిల్లా యూత్ విభాగం అధ్యక్షుడిగా ఎన్నికైన తిగుళ్ల సత్యం ను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వారి వెంట చందు,ముదిరాజ్ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *