ప్రజాతంత్ర కొడంగల్ నవంబర్ 18: ముదిరాజుల సంక్షేమం టిఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు కొడంగల్ నియోజకవర్గం లోని కోస్గి పట్టణంలో ముదిరాజుల ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతథులుగా మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్ గ,భూగర్భ వనరుల శాఖ మంత్రి వర్యులు పట్నం మహేందర్ రెడ్డి ,జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ ముదిరాజ్ కొడంగల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ దృష్టికి ముదిరాజుల సమస్యలు తీసుకువెళ్లి పరిష్కరిస్థామని అన్నారు.తెలంగాణ రాక ముందు వచ్చిన తర్వాత ఏం జరిగిందో మనం చూస్తున్నామని గత ప్రభుత్వాలు ముదిరాజులకు ఒక్క రూపాయి అయినా ఇచ్చాయా అని ప్రశ్నించారు మత్స్యకారుల అభివృద్ధి కోసం రూ. వెయ్యి కోట్లు సీఎం కేసీఆర్ ఇచ్చారనీ సీఎం కేసీఆర్ మత్స్యకారుల కోసం మోటార్ సైకిల్లు,బులోరో వాహనాలు ఇచ్చారనీ అన్నారుకొడంగల్ లో 1.16 ఎకరాల విస్తీర్ణంలో రూ. 2 కోట్లతో మత్స్యకార భవనాలు మంజూరు చేశామనీ సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి చేప పిల్లల డబ్బులు మత్స్యకార సంఘాలకు ఇచ్చేలా కృషి చేస్తామని అన్నారురాబోయే రోజుల్లో చెరువులు,కుంటల్లో చేప పిల్లలు విడిచే కార్యక్రమం చేపడుతామనీ త్వరలోనే 69 జీవో అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని చెరువులు, కుంటలపై మత్స్యకారులకే హక్కు కల్పించేలా సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని అన్నారు ముదిరాజుల అభివృద్ధికి ఎల్లవేళలా బి ఆర్ ఎస్ ప్రభుత్వం కావాలో పనిచేయని ప్రతిపక్షాలు కావాలో ప్రజలు తెలుసుకోవాలని అన్నారుపని చేసినవాళ్ళుఎవరూ.. చేయగలిగేవారు ఎవరు ఆలోచించాలి.మనల్ని కష్టంలో సుఖంలో ఆదుకునేది ఎవరో ఆలోచించుకొని కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నుంచి ముదిరాజులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ముదిరాజుల సంక్షేమమే బిఆర్ఎస్ లక్ష్యం



