ముదిరాజులు రాజకీయంగా ఎదగాలి

పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 3; ముదిరాజ్‌లు ఐక్యంగా ఉండి రాజ్యాధికార హక్కులు సాధించాలని రాష్ట్ర ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కార్యవర్గం అభిప్రాయపడింది.హైదరాబాద్‌ లోనీ మినిస్టర్ క్వార్టర్స్ లో  ముదిరాజ్‌ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు, శాసనమండలి డిప్యూటీ చైర్మన్  బండ ప్రకాష్‌  ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన కొటాల యాదగిరిని ముదిరాజ్‌ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమిస్తూ నియామక పత్రం అందజేశారు.దీనితో పాటు సిద్దీపేట జిల్లా ముదిరాజ్ మహాసభ  అధ్యక్షులుగా ధర్మాముదిరాజ్‌కు కూడా నియామకపత్రాన్ని అందించారు. సిద్దీపేట జిల్లా నూతన కార్యవర్గాన్ని కూడా ప్రకటించి నియామక పత్రాలు అందజేశారు.అనంతరం జరిగిన సమావేశంలో బండ ప్రకాష్  మాట్లాడుతూ ముదిరాజులు రాజకీయంగా ఎదగాలని దీనికోసం ప్రత్యేక కార్యచరణ రూపొందిస్తున్నట్టు తెలిపారు.ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ  ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ముదిరాజ్‌ లకు రెండు అసెంబ్లీ సీట్లు కేటాయించాలని అభిప్రాయపడింది.ముదిరాజులు రాజకీయ హక్కులు  సాధించే వరకూ అందరూ కలిసి కట్టుగా పనిచేయాలన్నారు.ఈ  సమావేశంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నీలం మధు ముదిరాజ్ పటాన్ చెరు నియోజకవర్గం డా.గుండ్లపల్లి శ్రీను ముదిరాజ్ తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,ప్రొఫెసర్ దినేష్ ముదిరాజ్, ముదిరాజ్ విద్యావంతుల వేదిక చైర్మన్అల్లుడు జగన్ ముదిరాజ్, యువత రాష్ట్ర ప్రదానకార్యదర్శి,సిద్దిపేట జిల్లా ముదిరాజ్ మహాసభ సభ్యులు,గజ్వేల్ ముదిరాజ్ మహాసభ సభ్యులు,తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *