జగదేవపూర్, ప్రజాతంత్ర, ఆగష్టు 24: జగదేవపూర్ మండల కేంద్రంలోని స్థానిక ఎల్లమ్మ టెంపుల్ వద్ద రాష్ట్ర బీసీ రత్న అవార్డు గ్రహీత, ముదిరాజ్ మండల అధ్యక్షుడు రాగుల రాజు ముదిరాజ్, యూత్ మండల అధ్యక్షులు హేమ సురేష్ విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కెసిఆర్ ముదిరాజలకు చట్టసభలలో స్థానo కల్పించక లేకపోవడం బాధకరమైన విషయమని అన్నారు.అదేవిధంగా చట్టసభలలో స్థానం కల్పించకపోతే ఎన్నికలను బహిష్కరిస్తామని అన్నారు.తెలంగాణలో 60 లక్షల మంది ముదిరాజు ఓటర్లను పక్కన పెట్టి మాకు ఒక ఎమ్మెల్యే సీటు కూడా లేకుండా చేయడం,సిగ్గుచేటు అని అన్నారు. అలాగే మా ముదిరాజులకు చాలా అన్యాయం జరిగిందని,అదేవిదంగా ఇతర పార్టీలు ఏమైనా మా ముదిరాజులకు చట్ట సభలలో స్థానం కల్పించినట్లయితే వారికే అన్నారు.ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం మండల మహిళా అధ్యక్షురాలు కొన్నే జయమ్మ, మంజుల రమేష్, ముదిరాజ్ మండల ప్రధాన కార్యదర్శి తిగుళ్ల బాలకిషన్, పెద్దమల్ల రాజయ్య,బోయిని పుల్లయ్య, వివిధ గ్రామాల ముదిరాజ్ సంఘం అధ్యక్షులు రమేష్, శ్రీనివాస్,మందాపూర్ సర్పంచ్ లింగాల బిక్షపతి,మంజుల రమేష్,గణేష్ ,యువరాజు, ఎల్లేష్, బాలయ్య,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


