వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, జులై 31:ముత్యాల ధర్మశాలను ఎండోమెంట్ నుండి తొలగించాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పేర్కొన్నారు. సోమవారం తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మాత్యులు ఇంద్రకరణ్ రెడ్డిని, ఎండోమెంట్ కమిషనర్లను కలిసిన వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ పట్టణంలోని ముత్యాల ధర్మశాలను ఎండోమెంట్ నుండి తొలగించాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ ముత్యాల ధర్మశాలను ఎండోమెంట్ నుంచి తొలగించేందుకు కృషి చేస్తామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఎండోమెంట్ కమిషనర్లు కానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం పెద్దలు అమ్రాది నర్సిములు, విజయ్ కుమార్, మాణిక్ ప్రభు, శ్రీరాములు, వేణుగోపాల్, మాణిక్యం , రఘునందం, రాజ్ కుమార్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.




